AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జల్లెడలో నిలిచిన నీరు.. అద్భుతం చేసిన యువకుడు.. షాకింగ్ సీన్ వెనుక సైన్స్ ఏమిటంటే..

నీరు పల్లం ఎరుగు నిజం దేవుడెరుగు అని అంటారు.. అంతేకాదు ఓటి కుండలో, జల్లెడలో నీరు నిలపడం సాధ్యమా అనే ఉపమానాలు తరచుగా గ్రామీణ ప్రాంతాల్లో వినిపిస్తూ ఉంటాయి. జల్లెడ లో నీరు నిలపడం అసలు ఊహకు కూడా అందని విషయం.. అటువంటి అద్భుతాన్ని ఒక యువకు చేసి చూపించాడు. ప్రస్తుతం చూస్తేగానీ నమ్మశక్యం కాని ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ షాకింగ్ వీడియోను మీరు కూడా చూడవచ్చు.

Viral Video: జల్లెడలో నిలిచిన నీరు.. అద్భుతం చేసిన యువకుడు.. షాకింగ్ సీన్ వెనుక సైన్స్ ఏమిటంటే..
Viral Video
Surya Kala
|

Updated on: Sep 22, 2025 | 12:46 PM

Share

సోషల్ మీడియా అనేది తరచుగా ప్రత్యేకమైన, అసాధారణమైనద విషయాలను తెలుసుకునే ఒక వేదిక. సోషల్ మీడియాలో ప్రతి రోజూ అనేక వీడియోలు వైరల్ అవుతాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రమే వినియోగదారులకు ఆసక్తిని కలిగిస్తాయి. ఇదినిజమేనా అని ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక యువకుడు నమ్మడానికి కష్టమైన పనిని చేసి చూపించాడు.

అద్భుతం చేసిన యువకుడు

వైరల్ వీడియోలో ఒక యువకుడు గంగా నది నీటిలో నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. అతను ఒక ప్లాస్టిక్ జల్లెడ ను ఒక గ్లాసు పట్టుకున్నాడు. ఆ యువకుడు జల్లెడలో నీరు పోసి జల్లెడలో నుంచి పడుతున్న నీటిని చూపిస్తూ.. తాను జల్లెడ నుంచి నీరు పడకుండా ఆపగలనని చెప్పాడు. యువకుడు చేస్తున్న పనిని షూట్ చేసున్న మరో వ్యక్తి అలా సాధ్యం కాదు అని అంటున్నారు. అయితే నదిలో నిలబడిన యువకుడు ఇది సాధారణ నీరు కాదన.. గంగా జలం కనుక సాధ్యం అవుతుందని తాను అది చేసి చూపిస్తానని చెప్పాడు. మళ్ళీ ఇది సాధ్యం కాదని మరో యువకుడు అన్నాడు. అప్పుడు ఆ యువకుడు ఒక గ్లాసులో నీటిని తీసి నీటితో నిండిన గ్లాసుపై జల్లెడ తిరగేసి పెట్టాడు. తరువాత ఆ యువకుడు తన చేతిని గ్లాసుపై ఉంచి.. జల్లెడను సాధారణ స్థితికి తీసుకుని వచ్చి.. అప్పుడు గ్లాస్ ని కవర్ చేసిన తన చేతిని తీసేశాడు. గాజు తలక్రిందులుగా ఉన్నప్పటికీ.. జల్లెడ నుంచి ఒక్క చుక్క కూడా నీరు పడలేదని వీడియో చూస్తే తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియోపై ఓ లుక్ వేయండి..

అద్భుతం వెనుక ఉన్న శాస్త్రం

వైరల్ వీడియోలో చిత్రీకరించబడిన ఈ ఫీట్ వాస్తవానికి అద్భుతం కాదు. ఈ ఫీట్ వెనుక భౌతికశాస్త్రం ఉంది. ఈ శాస్త్రాన్ని ఆ యువకుడు చక్కగా అప్లై చేశాడు. చక్కటి మెష్ ఉన్న జల్లెడపై నీరు ఉన్న గ్లాస్ ని పెట్టి.. దానిని తాకినప్పుడు.. ఆ జల్లెడ మేస్ మీద నీటి పలుచని పొర ఏర్పడుతుంది. నీటి అణువుల మధ్య ఆకర్షణ ఉపరితల ఉద్రిక్తతను సృష్టిస్తుంది. ఈ ఉద్రిక్తత జల్లెడలోని రంధ్రాల ద్వారా నీరు వెంటనే పడకుండా నిరోధిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..