విమానయాన రంగంలో ఎయిర్ విస్తారా ప్రస్థానం ముగిసిపోయింది. తొమ్మిదేళ్లుగా సేవలు అందించిన విస్తారా విమానయాన సంస్థ నవంబర్ 11 సోమవారం సాయంత్రం తన చివరి సర్వీసును నడిపింది. చివరిసారిగా ఎగిరిన విస్తారా విమానానికి విస్తారా సిబ్బంది భావోద్వేగంతో తుది వీడ్కోలు పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త సంస్థ విస్తారా.. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనమైంది. ఇక నుంచి విస్తారాకు సంబంధించిన హెల్ప్ డెస్క్, టిక్కెట్స్ వంటి అన్ని రకాల కార్యకలాపాలు ఎయిర్ ఇండియా చూసుకుంటుంది. కాగా, ఢిల్లీ విమానాశ్రయంలో విస్తారా చివరి సర్వీసుకు సిబ్బంది తుది వీడ్కోలు పలికిన క్షణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
విమానం పైకి ఎదుగుతున్నప్పుడు, మన కలలు కూడా అలాగే ఉంటాయి.. భవిష్యత్తు వైపు దూసుకుపోదాం, ఇక్కడ ఆకాశం పరిమితి కాదు, ప్రారంభం మాత్రమే.. అని విస్తారా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | Odisha: Vistara’s last flight UK 782 departed from Biju Patnaik International Airport to Delhi’s IGI Airport.
The airline prepares for its integration with Air India on Monday. Vistara, a joint venture between Tata Group and Singapore Airlines, will fully merge with… pic.twitter.com/jSLAeNKu08
— ANI (@ANI) November 11, 2024
ఇదిలా ఉంటే.. విస్తారా బ్రాండ్‌ను నిలిపివేయాలనే నిర్ణయం పట్ల అభిమానులతో పాటు బ్రాండింగ్ నిపుణులు, విమానయాన విశ్లేషకులలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విమాన సర్వీసుల్లో నాణ్యమైన ఆహారం, సర్వీస్, క్యాబిన్ ప్రమాణాల ద్వారా విస్తారా కస్టమర్ల ఆదరణ సంపాందించింది. ఎయిర్ ఇండియా సర్వీసులు నాసిరకంగా ఉంటాయనే ఫిర్యాదులు నేపథ్యంలో వారు విస్తరా విలీనం తర్వాత సేవలపై సందేహలు వినిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..