AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అక్కో.. బస్సు ఇలా కూడా ఎక్కొచ్చా.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే..

ఓ మహిళకు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఓ మహిళ బస్సు ఎక్కడం చూపరులను సైతం నివ్వెరపోయేలా చేసింది. ప్రజలు ఈ వీడియోను చూడటమే కాకుండా.. ఫన్నీ వేలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Viral Video: అక్కో.. బస్సు ఇలా కూడా ఎక్కొచ్చా.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే..
Women Climbed Bus
Ram Naramaneni
|

Updated on: Aug 16, 2024 | 8:03 AM

Share

ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు వచ్చిన తర్వాత.. బస్సుల్లో రకరకాల సీన్స్ మనం చూస్తూ ఉన్నాం. సీటు కోసం మహిళల మధ్య గొడవలు, కండెక్టర్స్, డ్రైవర్స్‌పై దాడికి దిగడం.. బస్సు ఆపనందుకు.. విధ్వంసానికి పాల్పడటం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో రిపోర్ట్ అయ్యాయి. ఇక ఫుట్‌బోర్డ్ ప్రయాణిస్తూ.. రన్నింగ్ బస్సు దిగేందుకు యత్నిస్తూ కూడా చాలామంది ప్రమాదాలకు గురయ్యారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఇన్సిడెంట్ మాత్రం చాలా రేర్. ఓ మహిళ విండో సీటు గుండా సెకన్ల వ్యవధిలో బస్సు ఎక్కింది. ఇందుకోసం ఎక్కవ ప్రయాస కూడా పడలేదు. వీడియో దిగువన చూడండి…

వీడియోను గమనిస్తే.. బస్సులో చాలా మంది ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. ఒక వ్యక్తి.. బస్సు లోపల చివర్న నిలబడి ఉండటం మీరు చూడవచ్చు. అతను కిటికీలో నుండి చూస్తూ ఒక మహిళను బస్సు ఎక్కించటానికి ప్రయత్నిస్తున్నాడు. బస్సు ఎక్కేందుకు ఆ మహిళ తన చెప్పులు తీసి లోపల ఉన్న వ్యక్తికి ఇచ్చింది. ఆ తర్వాత  ఆ మహిళ.. ఆ వ్యక్తి చేతిని పట్టుకుని కిటికీ గుండా బస్సులోకి ఎక్కింది. బస్సులో సీటు కోసం ఆ మహిళ బస్సు ఎక్కిన విధానాన్ని ఎవరో వీడియో తీయడంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రఫుల్ చౌరే అనే అకౌంట్ నుంచి ఈ వీడియోను Xలో షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు వేల మంది వీడియోను చూసి రకరకాల కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మీ ఒపినియన్ కూడా కామెంట్ ద్వారా వెల్లడించండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..