Vizag: బ్యాంకు రికార్డు రూమ్‌ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెతగ్గా…

విశాఖ స్టీల్ ప్లాంట్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాము కలకలం రేపింది. బ్యాంకులో పాము కనిపించడంతో సిబ్బంది, ఖాతాదారులు కలవరపడ్డారు. సకాలంలో పాము పట్టుకునే కిరణ్ అనే వ్యక్తి బ్యాంకులోని రికార్డు రూమ్ లో ఉన్న పాముతో బయటకు రావడం వీడియోలో కనిపిస్తుంది.

Vizag: బ్యాంకు రికార్డు రూమ్‌ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెతగ్గా...
Snake In Bank
Follow us

|

Updated on: Aug 16, 2024 | 8:32 AM

ప్రజంట్ రెయినీ సీజన్ కావడంతో.. జనావాసాల్లోకి పాములు తెగ వస్తున్నాయి. అప్రమత్తత లేకపోతే.. ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. తాజాగా విశాఖపట్నంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయంలోకి ఓ పాము ప్రవేశించడంతో కలకలం రేగింది. వడ్లపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీసు రికార్డు రూములోకి దూరి.. ఓ నాగ జెర్రి తిష్ట వేసింది. ఇక ఉదయమే బ్యాంకు తెరిచిన స్టాఫ్.. రికార్డు రూమ్‌లోకి వెళ్లిన వింత శబ్దాలు రావడంతో.. ఆందోళన చెందారు. ఆ రూమ్‌ అంతా వెతగ్గా.. పాము కనిపించడంతో పరుగులు తీశారు. అలాగే బ్యాంకుకు వచ్చిన కస్టమర్లు కూడా పామును చూసి పరుగు లఖించుకున్నారు.

బ్యాంకు సిబ్బంది వెంటనే  పట్టే స్నేక్ క్యాచర్‌ కిరణ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు స్నేక్ క్యాచర్.. చాకచక్యంగా ఆ పామును బంధించాడు. అతను చేతులతో ఆ పామును పట్టుకుని.. కార్యాలయం అంతా తిరగడంతో బ్యాంకు సిబ్బంది ఆశ్చర్యపోయారు. కాగా ఆ పామును నాగజెర్రి లేదా జెర్రిగొడ్డు అంటారని.. పెద్దగా విషపూరితం కాదని స్నేక్ క్యాచర్ వెల్లడించాడు. అనంతరం సమీపంలోని ఫారెస్ట్ ఏరియాలో ఆ పామును వదిలి పెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేయగానే.. వెంటనే రెస్పాండ్ అయి స్పందించి… బ్యాంకుకు వచ్చిన స్నేక్ క్యాచర్ కిరణ్‌ను బ్యాంకు సిబ్బంది థ్యాంక్స్ చెప్పారు.

స్నేక్ క్యాచర్ అలవోకగా..  పామును పట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. అతను ఆ పామును చాలా ఈజీగా హ్యండిల్ చేశాడని పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వీడియో దిగువన చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?