Viral Video: హవ్వ… బ్యాంకులో అదేం పనిరా అయ్యా… నెట్టింట చక్కర్లు కొడుతున్న మేనేజర్ వీడియో
బ్యాంకులో ఉద్యోగులకు సాధారణంగా ఏం పనుల ఉంటాయి? అని అడిగితే అదేం ప్రశ్నరా బాబు తలాతిక్కా లేని ప్రశ్న అడుగుతున్నావు అంటూ సెటైర్స్ వినపడటం ఖాయం.. ఎందుకంటే బ్యాంకులో ఉద్యోగులు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. కస్టమర్స్ సేవల్లో తలమునకలై ఉండే ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా...

బ్యాంకులో ఉద్యోగులకు సాధారణంగా ఏం పనుల ఉంటాయి? అని అడిగితే అదేం ప్రశ్నరా బాబు తలాతిక్కా లేని ప్రశ్న అడుగుతున్నావు అంటూ సెటైర్స్ వినపడటం ఖాయం.. ఎందుకంటే బ్యాంకులో ఉద్యోగులు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. కస్టమర్స్ సేవల్లో తలమునకలై ఉండే ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అలాంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక రీల్స్ ట్రెండ్స్ నడుస్తోంది. చాలా మంది ఫేమస్ అయ్యేందుకు రకరకాల రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రీల్ కోసం చేసిన ఓ వీడియో ఇప్పుడు రచ్చ లేపుతోంది. బ్రాంచ్ మేనేజర్ అలోక్ కుమార్ ఆఫీసులో వర్క్ చేస్తుండగా ఓ మహిళ తన చుట్టూ తిరుగుతూ ‘సారా సారా దిన్ తుం కామ్ కరోగే తో ప్యార్ కబ్ కరోగే’ పాటకు రీల్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. రీల్ ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది.
వీడియో చూడండి:
A reel video of a State Bank of India (SBI) employee is going viral on social media. In the video, a branch manager is seen sitting in his office and working, while a woman records a reel around him to the song “Sara Sara Din Tum Kaam Karoge To Pyar Kab Karoge.” @TheOfficialSBI pic.twitter.com/B5lBQDvSu4
— Hellobanker (@Hellobanker_in) November 8, 2025
వైరల్ వీడియోలో డెస్క్‌పై కంప్యూటర్, ఫైల్స్ ఉండగా ఆ వెనాకల అవార్డుల ట్రోఫీలు కనిపిస్తున్నాయి. వర్క్ హాలిజమ్ వర్సెస్ రొమాన్స్‌ను హైలెట్ చేస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో ఇండియన్ బ్యాంకిగ్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు.
బ్రదర్ త్వరలో సస్పెండ్ అవుతాడు అంటూ కొంత మంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ పెడుతున్నారు. పబ్లిక్ ఆఫీసులు ఎంటర్‌టైన్మెంట్ కోసం ఉన్నాయా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్లు లవ్ బర్డ్స్.. వాళ్లను సస్పెండ్ చేయకండి మరికొంత మంది ఉన్నతాధికారులను ఉద్దేశించి కామెంట్స్ పెట్టారు.
