Viral Video: ఎగిరే పిల్లి టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Viral Video: రకరకాల వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఎక్కవుగా పాములు, మొసళ్లు, పులులు, ఇతర జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అ..

Viral Video: రకరకాల వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఎక్కవుగా పాములు, మొసళ్లు, పులులు, ఇతర జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇక ఇక్కడ మాత్రం ఓ పిల్లిని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆ పిల్లి గాల్లో ఎగుతున్న వస్తువులనే సైతం ఇట్టే పట్టేసుకుంటోంది.
సోషల్ మీడియాలో పిల్లుల వీడియోలన్నీ ప్రతిరోజూ వైరల్ అవుతున్నప్పటికీ, ఈ వీడియో మిగిలిన వాటికి భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు పిల్లులు ఎవరినైనా వేధించడం లేదా కుక్కలతో పొట్లాడటం వంటి వీడియోలు చూసి ఉంటారు. కానీ ఈ వీడియోలో మీరు పిల్లి టాలెంట్‌ను చూసి ఆశ్చర్యపోవాల్సిందే.




Flying cat..??? pic.twitter.com/9cllcfqgVt
— ?o̴g̴ (@Yoda4ever) July 30, 2022
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ పిల్లిని ఎగిరే పిల్లి అని పిలుస్తున్నారు. ఈ వీడియోను ఇంట్లో రికార్డు చేసి స్లో మోషన్ ఎఫెక్ట్‌తో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూస్తే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. దీంతో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ట్విట్టర్‌లో @yoda4ever అనే ఖాతాతో పోస్టు చేశారు. వీడియోను ఇప్పటివరకు 95 వేలకు పైగా వీక్షించగా, 4 వేల మందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి