Viral Video: ఏయ్.. నా మీదకే వస్తావా.. పాముతో పిల్లి ఫైట్ మామూలుగా లేదు.. వీడియో వైరల్
అది పిల్లి కాదు.. పులి..! విష సర్పంతో పిల్లి పోరాటం చూశారా..? గొడవ మొదట్లో పాము గెలిచేలా కనిపించినా.. పిల్లి చేసిన పనికి అంతా షాక్ అవుతారు. ఈ అద్భుతమైన ఫైట్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎవరికైనా భయమైతే.. ఈ పిల్లిని బాడీగార్డ్‌గా పెట్టుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పాము అంటే ఎవరికి భయం ఉండదు. చాలా మంది దాన్ని పేరు చెప్తేనే భయపడతారు. ఇక పిల్లులు చిన్నగా కనిపించినా.. ఒక్కోసారి పులిలా మారుతాయి. మరి తెలివైన పిల్లి, ప్రమాదకరమైన పాము ఒకదానితో ఒకటి ఢీకొంటే ఏమవుతుంది..? ఎవరు గెలుస్తారు..? ఇలాంటి అద్భుతమైన పోరాటానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
పిల్లి vs పాము: పోరాటంలో ట్విస్ట్..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక వైపు పిల్లి, మరోవైపు విషపూరితమైన పాము నువ్వా..? నేనా..? అనేలా పోట్లాడుకుంటున్నాయి. పోరాటం మొదట్లో పాము పైచేయి సాధించినట్లు కనిపించింది. అది పిల్లిని చుట్టుముట్టి కాటు వేయడానికి ప్రయత్నించింది. కానీ పిల్లి తన ధైర్యాన్ని, తెలివిని ఉపయోగించడంతో క్షణాల్లో పరిస్థితి మారిపోయింది. పిల్లి పాము నోటిని గట్టిగా పట్టుకుని, తన పదునైన దంతాలతో కొరకడానికి ప్రయత్నించింది. ఈ వీడియోను చూస్తే.. పిల్లులు చిన్నగా కనిపించినా అవి నిజానికి చాలా ప్రమాదకరమైనవని, విషసర్పం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనే విషయం అర్ధమవుతుంది.
వీడియో వైరల్.. నెటిజన్ల రియాక్షన్
ఈ అద్భుతమైన 31 సెకన్ల వీడియోను ఎక్స్‌లో @AmazingSights అనే యూజర్ షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 33,000 కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది. వందలాది మంది దీనిని లైక్ చేసి, రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ సరదాగా.. అది పులి కాదు పిల్లి.. అని కామెంట్ చేయగా.. మరొకరు ఎవరికైన భయమైతే పిల్లిని బాడీగార్డ్‌గా పెట్టుకోండి అని కామెంట్ చేశారు. చాలా మంది యూజర్లు ధైర్యం అనేది శరీరం సైజును బట్టి కాదని, గుండె బలం బట్టి ఉంటుందని ఈ వీడియో నిరూపించిందని చాలా మంది కామెంట్ చేశారు.
— Damn Nature You Scary (@AmazingSights) October 31, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
