Viral Video: ఏటీఎంలో ఇరుక్కున్న డెబిట్ కార్డు.. దానిని తీసేందుకు ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో వైరల్
Viral Video: కొన్ని వీడియోలో ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఏదైనా వీడియో వైరల్ కావాలంటే అది సోషల్ మీడియానే (Social Media). ఎక్కువగా..
Viral Video: కొన్ని వీడియోలో ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఏదైనా వీడియో వైరల్ కావాలంటే అది సోషల్ మీడియానే (Social Media). ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో పులులు, సింహాలు, పాములు, మొసళ్ల వీడియోలు ఉంటాయి. ఇక ఇక్కడ జరిగిన ఓ ఘనటపై వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా చాలా మంది ఏటీఎం మెషీన్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసేందుకు వస్తుంటారు. మెషీన్‌లో కార్డు పెట్టి డబ్బులు తీసుకున్న తర్వాత బయటకు తీసుకోవచ్చు. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో సాంకేతి కారణాల వల్ల డెబిట్‌కార్డు మెషీన్‌లోనే ఇరుక్కుపోతుంటాయి.
అలాంటి పరిస్థితి ఓ వ్యక్తికి ఎదురైంది. సదరు వ్యక్తి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ఓటీఎం వద్దకు వచ్చాడు. కానీ అతని డెబిట్ కార్డు ఏటీఎం మెషీన్‌లోనే ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించిన అది బయటక వెళ్లకపోవడంతో సదరు కస్టమర్ టెన్షన్‌కు గురయ్యాడు. ఎంత బలంగా ట్రై చేసినా బయటకు రాలేదు. కానీ చివరకు ఓ ఉపాయం చేశాడు. ఏటీఎం కార్డును బయటకు తీసేందుకు కటింగ్ ప్లేర్‌ను ఉపయోగించాడు. దాంతో ఏటీఎం మెషీన్‌లో ఇరుక్కున్న డెబిట్ కార్డును బయటకు తీశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు అయిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో jugraj_mahal0 అనే ఖాతాతో పోస్టు చేయబడింది. జూలై 3న షేర్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది చూశారు. 2.50 లక్షలకుపైగా మంది యూజర్లు కూడా ఈ వీడియోను లైక్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి