Viral Video: ఆన్‌లైన్ గేమ్స్‌లో అదరగొడుతున్న పిల్లి.. వీడియో చూస్తే మీరూ వావ్ అంటారు..
సోషల్ మీడియాలో నిత్యం వేలాది ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులోనూ ఇటీవల జంతువుల ఫొటోలు, వీడియోలు బాగా వైరలవుతున్నాయి.
సోషల్ మీడియాలో నిత్యం వేలాది ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులోనూ ఇటీవల జంతువుల ఫొటోలు, వీడియోలు బాగా వైరలవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలో ఒక పిల్లి ఆన్‌లైన్ గేమ్స్‌లో అదరగొడుతోంది. స్మార్ట్ ట్యాబ్‌లో చురుగ్గా ఆటలు ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ దృష్యాలను చూసి నెటిజన్లు చూసి ఫిదా అవుతున్నారు. నెట్టింట్లో బాగా వైరలవుతోన్న ఈ వీడియోలో.. ఒక సోఫాలో అమ్మాయితో కలిసి పెంపుడు పిల్లి ఉంటుంది. ఆ అమ్మాయి ట్యాబ్‌లో ఫ్రూట్ నింజా గేమ్ ఆడుతూ ఉంటుంది. అయితే ఆట మధ్యలో పిల్లి ఎంట్రీ ఇస్తుంది. గేమ్ ఆడే క్రమంలో.. ఆ పిల్లి తన రెండు కాళ్లతో ట్యాబ్ స్క్రీన్‌పై పండ్లను కట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు అమ్మాయి వేళ్లతో పండ్లను కోస్తే.. పిల్లి తన గోళ్లతో కోయడం మొదలు పెడుతుంది. దీంతో గేమ్‌లో పండ్లు వేగంగా కిందికి రాలిపోతాయి.
ఈక్రమంలో మరింత దూకుడు కనబర్చిన పిల్లి ఏకంగా ట్యాబ్ స్ర్కీన్‌పై దూకేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అదుపు తప్పి సోఫా మీద నుంచి కిందకు పడిపోతుంది. Yoda4ever అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో అప్‌లోడ్ అయింది. దీనికి ‘కిట్టి గాట్ ఏ లిటిల్ క్యారిడ్ అవే’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. నెటిజన్లు ఫన్నీ, లాఫింగ్ ఎమోజీలతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ‘వీడియో చాలా ఫన్నీగా ఉంది. అయితే పిల్లి గోర్లు తగలడం వల్ల ట్యాబ్లెట్ పాడవుతుంది. జాగ్రత్త’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లలో పిల్లులు ఆటలు ఆడటం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. ఇందుకోసం కొన్ని కంపెనీలు కూడా ప్రత్యేకంగా యాప్‌లను రూపొందించడం ప్రారంభించాయి.
Ninja kitty got a little carried away..????? pic.twitter.com/vZDwPNwoYF
— ?o̴g̴ (@Yoda4ever) April 19, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read:
నెట్టింట నవ్వులు పూయిస్తున్న కోతిపిల్ల !! బాల్యం గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు
Sreeleela : మహేష్ సినిమాలో శ్రీలీల క్యరెక్టర్‌ను ఇలా డిజన్ చేస్తున్నారట గురూజీ..