Viral Video: ‘డ్రెస్ తీసేసి రారా చీరుతా’ అన్నాడు.. ఆ తరువాత ఏడుస్తూ కూర్చున్నాడు.. సీన్ మామూలుగా లేదు..!
Viral Video: కొంత మంది తమకు తాము పెద్ద తోపుల్లా ఫీల్ అవుతారు. పక్కనున్న వారిని చూసుకుని రెచ్చిపోతుంటారు. ‘హల్ చల్ మే గుడాలుడికే’ అన్నట్లు..

Viral Video: కొంత మంది తమకు తాము పెద్ద తోపుల్లా ఫీల్ అవుతారు. పక్కనున్న వారిని చూసుకుని రెచ్చిపోతుంటారు. ‘హల్ చల్ మే గుడాలుడికే’ అన్న డైలాగ్ మాదిరిగా నానా రభస చేస్తారు. తప్పు చేసి కూడా ఎదుటివారిపై ఎగబడిపోతారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొందరు యువకులు.. ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోతున్నారు. మధ్యం మత్తులోనో.. అధికారదర్పంతోనో.. అహంకారంతోనో గానీ.. తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. వారిపై చేయి చేసుకున్న ఘటనలు కూడా కోకొల్లలుగా వెలుగు చూశాయి. తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలో వెలుగు చూసింది. ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసుపై తన ప్రతాపాన్ని చూపించారు. రెచ్చిపోయి నానా బూతులు తిట్టారు. అయితే, ఈ పోలీసు.. అదంరిలా ఊరుకోలేదు. చుక్కలు చూపించాడు. గంటల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయ్యింది. గంభీరంగా బూతులు తిట్టన నోటితోనే.. బోరున విలపిస్తూ ముక్కు, కళ్లు తుడుచుకుంటూ బిక్కు బిక్కుమంటూ స్టేషన్‌లో ఓ మూలకు కూర్చున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. బాబుకు.. బాజా మోగిందంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మహారాష్ట్ర ముంబైలోని మీరా రోడ్డు ఓ వ్యక్తి తన కారును నోపార్కింగ్ స్థలంలో నిలిపాడు. అది గమనించిన ట్రాఫిక్ అధికారి తన కిందిస్థాయి సిబ్బందితో కలిసి వచ్చి దానిని తొలగించే ప్రయత్నం చేశారు. అంతలోనే.. అక్కడికి వచ్చిన కారు ఓనర్ పోలీసు అధికారిని ప్రశ్నించారు. తన కారును తీసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. పోలీసులతో దరుసుగా ప్రవర్తిస్తూ వారిని బూతులు తిట్టాడు. యూనిఫామ్ ముసుగులో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అడ్డమైన కూతలు కూశాడు. ‘యూనిఫామ్ తీసి రారా.. నీ తాట తీస్తా..’ అంటూ రెచ్చిపోయాడు. ఇంకా అతని వెంట మరో మహిళ కూడా ఉంది. వారి వాగ్వాదాన్ని పోలీసులు చాలా కూల్‌గా ఫేస్ చేశారు. అతని మాటలను, అతని ప్రవర్తనను అంతా రికార్డ్ చేశారు. అయితే, ఆ ఇద్దరు వ్యక్తులు కనీసం మాస్క్ కూడా ధరించకపోవడంపై కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించినట్లయ్యింది. ఇలా వీరిపై పోలీసులు రెండు రకాలుగా కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం కారణాలుగా చూపుతూ వీరిపై కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి.. పోలీసులు తమదైన స్టైల్‌లో విందు ఏర్పాటు చేశారు. ఇంకేముంది.. సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి వరకు ఎగిరిపడిన ఆ నోరు.. ఓ మూలన కూర్చుని బిక్కు బిక్కుమంటూ ఏడుస్తూ కూర్చుంది. ఈ సన్నివేశాన్ని కూడా వీడియో చిత్రీకరించారు.
ఆ వ్యక్తి రోడ్డుపై ఎగిరిపడిన తీరుకు సంబంధించిన వీడియోను.. స్టేషన్‌లో ఏడుస్తూ కూర్చున్న వీడియోను రెండింటినీ కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ ఫన్నీ వీడియోను చూసి నెటిజన్లు మామూలుగా కామెంట్స్ చేయడం లేదు. ‘దూల తీరింది’ అంటూ కొందరు డైరెక్ట్‌గా క్రిటిసైజ్ చేస్తున్నారు. మరికొందరు ‘కాకకు విందు గట్టిగానే పెట్టారు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
Picture abhi baaki hai pic.twitter.com/B31WJUHw4c
— Manish Bhartiya ?? (@Mahakalwale) July 9, 2021
Also read:
CM YS Jagan: క్రికెట్ ఆడిన సీఎం జగన్.. క్లాసీ షాట్స్‌తో కరేజ్ చూపించారు.. క్లాప్స్ కొట్టించారు
Mani Ratnam Navarasa : నవరసాలను చూపించిన మణిరత్నం.. ఆకట్టుకుంటున్న టీజర్
