AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పంటల కోసం పగటేషగాళ్లుగా రైతులు… కోతులను తరిమేందుకు పాపం ఇలా..

గ్రామాల్లో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. షాపులను గుళ్ల చేస్తున్నాయి. ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి. పల్లెల్లో మనుషుల కన్నా కోతుల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఊళ్లో ఇళ్లపై పడుతున్న కోతులు ఊరిచివర పంటపొలాలపై పడుతున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. అధికారులు, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా...

Viral Video: పంటల కోసం పగటేషగాళ్లుగా రైతులు... కోతులను తరిమేందుకు పాపం ఇలా..
Farmers Bear Costumes
K Sammaiah
|

Updated on: Dec 16, 2025 | 5:08 PM

Share

గ్రామాల్లో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. షాపులను గుళ్ల చేస్తున్నాయి. ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి. పల్లెల్లో మనుషుల కన్నా కోతుల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఊళ్లో ఇళ్లపై పడుతున్న కోతులు ఊరిచివర పంటపొలాలపై పడుతున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. అధికారులు, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందంటున్నారు ప్రజలు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌ రైతులు చేసిన ఓ వినూత్న కార్యక్రమం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పెరుగుతున్న కోతుల బెడదతో విసిగిపోయిన బిజ్నోర్ రైతులు ఒక అసాధారణమైన కానీ ప్రభావవంతమైన పరిష్కారంతో ముందుకు వచ్చారు. తమ పంటలను రక్షించుకోవడానికి ఎలుగుబంటి వేషాలు వేసుకుని కోతుల బెడద నుంచి తమ పంటలను రక్షించుకుంటున్నారు. అనేక గ్రామాల్లోని యువ రైతులు ఎలుగుబంటి దుస్తులు ధరించి తమ పొలాల్లో గస్తీ తిరగడం ప్రారంభించారు. పంటలను నాశనం చేస్తున్న కోతులను భయపెట్టి తరిమేస్తున్నారు.

ఈ వినూత్న పద్దతి ఫలితాలను చూపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. “గతంలో, కోతులు పెద్ద గుంపులుగా వచ్చి మా పొలాలను నాశనం చేసేవి. ఇప్పుడు, చెట్లపై కూర్చున్నవి కూడా ఎలుగుబంటి వేషాన్ని చూడగానే పారిపోతున్నాయి,” అని రైతులు చెబుతున్నారు. అయితే సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతోన్న వీడియో పట్ల నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు.

వీడియో చూడండి: