AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘ఎలా మావ ఇలా..’ వీడియోపై నెటిజన్ల ఫన్నీ రెస్పాన్స్

సీటు దొరికే పరిస్థితి లేదు. ఇంకా చాలాదూరం ప్రయాణం చేయాలి. ఏం చేస్తాడు మరీ.. ఇదిగో ఇలా తనకు తానే ఓ సీటు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇలాంటి పనులతో రిస్క్ కూడా ఉంటుంది.

Viral Video: 'ఎలా మావ ఇలా..' వీడియోపై నెటిజన్ల ఫన్నీ రెస్పాన్స్
Train
Ram Naramaneni
|

Updated on: Aug 24, 2024 | 1:38 PM

Share

మన దేశంలో రైళ్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ప్రయాణీకులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. కొన్ని రైళ్లతో అయితే గాలి దూరే సందు కూడా ఉండదు. ఉత్తర భారతంలో నడిచే రైళ్లలో రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. జనరల్ కంపార్ట్‌మెంట్‌లో సీటు దొరికింది అంటే.. సుడి ఉన్నట్లే లెక్క. సీట్లు లేక వేలాడుతూ వెళ్లడం.. బాత్రూమ్స్‌లో నిల్చుని ప్రయాణించడం వంటి సీన్స్ కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇక ట్రైన్‌లో సీటు కోసం కొందరు కొత్త తరహా ఐడియాలు వేస్తుంటారు. ఇదిగో ఇతగాడి ప్లాన్ ఆ కోవకు చెందినదే. ట్రైన్‌లో సీట్లు లేకపోవడంతో.. ఓ వ్యక్తి బెడ్ షీట్ సాయంతో.. ఇదిగో ఇలా ప్లాన్ చేస్కుని ఎంచక్కా అందులో కూర్చున్నాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ట్రైన్‌లోని ఓ ప్రయాణికుడు ఇతగాడి పనిని వీడియో తీయడంతో అది కాస్తా వైరల్ అయింది.

వీడియో దిగువన చూడండి… 

రైల్లో కిక్కిరిసిపోవడంతో ఓ వ్యక్తికి సీటు దొరకలేదని వీడియోని బట్టి మనం గమనించవచ్చు. అటువంటి పరిస్థితిలో, అతను ఒక షీట్ తీసి పైన ఉన్న హ్యాండిల్‌పై రెండు వేర్వేరు ప్రదేశాలలో కట్టి, దానిపై కూర్చుని ఆనందంగా ప్రయాణిస్తున్నాడు. ఈ విధంగా అతను తన కోసం ఒక సీటును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వీడియోను rahulmehto2525 అనే అకౌంట్ నుంచి ఇన్ స్టాలో షేర్ చేశారు.  వార్త రాసే సమయానికి వీడియోకు 1700 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. నెటిజన్స్ వీడియో కింద రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ‘ప్లాన్ బానే ఉంది కానీ ఆ షీట్ తెగితే నడుములు విరుగుతాయ్’ అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. నీడ్ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని మరొకరు కామెంట్ పెట్టారు. వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..