AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బతికితే ఈ గేదెలా బతకాలి.. సింహాల మందపైకి దూసుకెళ్లింది..

సోషల్ మీడియాలో జంతువుల ఫైట్‌కు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు కొన్నిసార్లు నివ్వెరపరుస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఓ గేదె సింహాల మందపైకి ఫైటింగ్‌కి వెళ్లింది.

Viral Video: బతికితే ఈ గేదెలా బతకాలి.. సింహాల మందపైకి దూసుకెళ్లింది..
Lions Vs Buffalo
Ram Naramaneni
|

Updated on: Aug 24, 2024 | 1:23 PM

Share

అడవిలో సింహాలు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తాయో చెప్పాల్సిన పనిలేదు. అవి.. అడవి మొత్తాన్ని తమ రాజ్యంగా భావించి.. దర్పం ప్రదర్శిస్తాయి. ఏ జంతువును అయినా వేటాడి ఆహారంగా మార్చుకోగలవు. ఒక్క సింహం అటాక్ చేస్తేనే మరో జీవికి దిక్కు ఉండదు. దానికి లొంగిపోయి ఆహారంగా మారిపోవాల్సిందే. అలాంటిది సింహాల మందపైనే ఫైటింగ్‌కి వెళ్లింది ఓ గేదె. తన సహచర గేదెను కాపాడుకునేందుకు లైఫ్‌నే రిస్క్ చేసింది. అవును.. ఆల్రెడీ.. ఒక గేదెను వేటాడి.. బంధించాయి సింహాలు. ఇలాంటి సమయంలో మందగా ఉన్న గేదెలు అటాక్ చేస్తే.. బంధీగా ఉన్నదాన్ని బ్రతికించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఓ గేదె సింగిల్‌గానే వాటిపైకి పోరాటానికి దిగి.. సహచర  గేదెను కాపాడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వీడియో దిగువన చూడండి…. 

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక గేదెను సింహాలు బంధించి.. ఆహారంగా మార్చేందుకు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలో మరో గేదె అక్కడికి వచ్చింది. మందగా ఉన్న సింహాలను భయపెట్టి.. బంధించిన గేదెకు విముక్తి కల్పించింది. అయితే సింహాలు కోపంతో.. వాటి చుట్టారా తిరిగాయి. ఈ వీడియో క్లిప్ అంతటితో ఎండ్ అయింది. తర్వాత ఏం జరిగింది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఏది ఏమైనా ప్రాణాలకు తెగించి.. గుండె బలంతో సహచర గేదెను కాపాడేందుకు ఆ గేదె చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. వీడియోపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!