AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బ్యాగులో 300 పాములను తీసుకెళ్లి అడవిలో వదిలి పెట్టాడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌

Viral Video: పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. ఏదైనా వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే అని చెప్పాలి..

Viral Video: బ్యాగులో 300 పాములను తీసుకెళ్లి అడవిలో వదిలి పెట్టాడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌
Subhash Goud
|

Updated on: Feb 02, 2022 | 11:57 AM

Share

Viral Video: పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. ఏదైనా వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే అని చెప్పాలి. ఒక వ్యక్తి వందలాది పాములను అడవిలో వదిలిపెడుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘memewalanews’ అనే యూజర్‌ రెండు రోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఇంకేముందు తెగ వైరల్‌ అవుతోంది. ఆ వ్యక్తి దాదాపు 300 పాములను విడిచిపెట్టాడని ఈ యూజర్‌ పేర్కొన్నాడు.

వీడియోలో ఒక వ్యక్తి అడవిలో ప్రార్థనలు చేస్తూ, తన చేతుల్లో ఒక పెద్ద ఆకుపచ్చ రంగు సంచిని బహిరంగ ప్రదేశానికి తీసుకువస్తున్నాడు. గన్నీ బ్యాగ్‌లోంచి బయటకు వచ్చిన పాముల మొత్తాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నెటిజన్లను అత్యంత భయభ్రాంతులకు గురిచేసిన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి తన పాదాల దగ్గర ఉన్న 300 పాములతో నిండిన గోనె సంచిని నిర్భయంగా ఖాళీ చేసిన విధానం. సంచిలోంచి పాములను విడుస్తూ తన చేతులతో పాములను వేర్వేరుగా చేయడం ఒళ్ల గగుర్పొడిచేలా ఉంది.

View this post on Instagram

A post shared by Meme wala (@memewalanews)

ఇవి కూడా చదవండి:

Rs 500 Note: రూ.500 నోటు నకిలీదా..? నిజమైనదా..? గుర్తించడం ఎలా..? ఆర్బీఐ ఏం చెబుతోంది..!

Budget 2022: కేంద్రం గుడ్‌న్యూస్‌.. రూ.10 లక్షల వరకు ఉన్న ఆదాయానికి పన్ను ఉండదు.. ఎవరికో తెలుసా..?