Viral Video: అరెరే.. ఇదేంటయ్య పుష్పరాజ్.. శ్రీవల్లి పాటను ఇలా చేశావ్..
చూపే బంగారమయెనా శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయెనే.. ఇప్పుడు ఎక్కడా విన్నా ఇదే సాంగ్.. చంద్రబోస్ రాసిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్
చూపే బంగారమయెనా శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయెనే.. ఇప్పుడు ఎక్కడా విన్నా ఇదే సాంగ్.. చంద్రబోస్ రాసిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. సిద్ శ్రీరామ్ (Sid Sriram) ఆలపించాడు. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన పుష్ప (Pushpa) సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేయగా.. సోషల్ మీడియాలో ఈ మూవీ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. పుష్ప పాటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్.. లుక్.. స్టైల్.. పుష్పరాజ్ మేనరిజం ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో పుష్ప పాటలకు..డైలాగ్స్‌ను తమ స్టైల్లో ఫాలో అవుతూ రచ్చ చేస్తున్నారు నెటిజన్స్.
బన్నీ.. రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప సినిమా గతేడాది డిసెంబర్ నెలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పాటల క్రేజ్ ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. అయితే ఎంతో అందంగా సాగే శ్రీవల్లి పాటను జానపదంగా పాడితే ఎలా ఉంటుందో విన్నారా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కాశ్మీరికి చెందిన ఫోక్ సింగర్ శ్రీవల్లి పాటను తనస్టైల్లో పాడారు. హార్మోనియం వాయిస్తూ శ్రీవల్లి పాటను అందంగా జానపదం గొంతుతో ఆలపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
this is extreme pic.twitter.com/JsgMJCiuAx
— Muhammad Tabish (@tabishhaji) January 31, 2022