Viral Video: బాహుబలి బ్రదర్‌లా ఉన్నాడే.! ట్రాఫిక్ జామ్‌లో భుజాన్న బండితో.. వీడియో చూస్తే
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి ట్రాఫిక్ జామ్ నుంచి బయట పడేందుకు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న తన స్కూటీని భుజంపై వేసుకుని వాహనాల మధ్య చకచకా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

మన దేశంలో ట్రాఫిక్ జామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు.. బాధితులు. దేశంలోని ప్రతి నగరానికి పెద్ద సమస్యగా మారింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గురుగ్రామ్, నోయిడా, హైదరాబాద్ ఇలా అనేక నగరాల్లో ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోతారు. ఈ ట్రాఫిక్ జామ్ నుంచి బయపడేందుకు వివిధ పనులు చేస్తారు. ఈ రోజుల్లో ఇలాంటిదే వినియోగదారులలో చర్చనీయాంశమవుతోంది. ట్రాఫిక్‌తో విసుగు చెందిన ఒక వ్యక్తి తన భుజాలపై స్కూటీని ఎత్తి పట్టుకున్నాడు.. ఈ వీడియో ఇప్పుడు తెరపైకి వచ్చి సందడి చేస్తుంది.
ఈ క్లిప్ దాదాపు 12 సెకన్ల నిడివి ఉంది. రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. కార్లు, బైక్‌ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ లో చిక్కుకుని తాము వెళ్ళే సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఇద్దరు అబ్బాయిలు అకస్మాత్తుగా తమ స్కూటర్‌ను తీసుకొని నడుచుకుంటూ వెళుతున్నారు. సాధారణంగా ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటారు లేదా తము వెళ్లేందుకు ఏ మాత్రం వీలున్నా.. చోటు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ ఇద్దరు యువకులు చేసింది ఊహకు అందనిది. వీడియోలో కనిపించే వాహనాల నెంబర్ ప్లేట్ బట్టి ఇది హర్యానాలో చోటు చేసుకున్నది అని ఊహిస్తున్నారు.
వీడియోను ఇక్కడ చూడండి
View this post on Instagram
హర్యానా రోడ్లపై తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతుతాయి. కానీ ఈసారి ప్రజల దృష్టి ట్రాఫిక్ జామ్‌పై కాదు, తమ స్కూటీని తమ భుజంపై ఎత్తుకుని నడుకుంటూ వెళ్తున్న ఆ ఇద్దరు యువకులపై ఉంది. ఈ వీడియోను gurgaon_locals అనే ఖాతా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ వార్త రాసే సమయానికి, వేలాది మంది దీనిని చూశారు.
దీనితో పాటు, ప్రజలు దీనిపై వ్యాఖ్యానించడం ద్వారా తమ ప్రతిచర్యలను తెలియజేస్తున్నారు. ట్రాఫిక్‌ను అధిగమించే ఈ విధానం చాలా అద్భుతంగా ఉందని ఒక వినియోగదారు రాశారు. అదే సమయంలో మరొకరు ఈ పద్ధతితో మీరు త్వరగా చేరుకుంటారు. అయితే తర్వాత మీరు మసాజ్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మరొకరు హబీబీ గుర్గావ్‌కు స్వాగతం అని వ్యాఖ్యానించారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




