Viral Video: చునువిచ్చింది కదా అని సెల్ఫీకి ట్రై చేశాడు… ఇంతలోనే షాకింగ్ సీన్
పులిని దూరం నుంచి చూడాలంటే చూడు.. చనువు ఇచ్చింది కదా అని దాని జూలు పట్టుకొని లాగితే..చూస్తూ ఊరుకుంటుందా...? అదేదో సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్ అనుకుంటున్నారా? డైలాగ్ మాటేమోగానీ, పులితో సెల్ఫీకి ట్రై చేస్తే ముఖం వాచిపోయేలా చాచి కొట్టింది. థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన ఓ భారతీయుడికి...

పులిని దూరం నుంచి చూడాలంటే చూడు.. చనువు ఇచ్చింది కదా అని దాని జూలు పట్టుకొని లాగితే..చూస్తూ ఊరుకుంటుందా…? అదేదో సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్ అనుకుంటున్నారా? డైలాగ్ మాటేమోగానీ, పులితో సెల్ఫీకి ట్రై చేస్తే ముఖం వాచిపోయేలా చాచి కొట్టింది. థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన ఓ భారతీయుడికి ఎదురైన షాకింగ్ అనుభవం ఇది. థాయ్‌లాండ్‌లో ఫేమస్ టైగర్ కింగ్‌డమ్ లో పులి భారతీయ పర్యాటకుడిపై దాడి చేసింది. ఈ ఘటనలో సదరు టూరిస్ట్‌కు గాయాలయ్యాయి.
భారత్‌కు చెందిన ఓ యువకుడు థాయ్‌లాండ్‌లోని పుకెట్ దీవుల పర్యటనకు వెళ్ళాడు. అక్కడి ఫేమస్ టైగర్ కింగ్‌డమ్‌ను సందర్శించాడు. అక్కడ పులితో కలిసి కాసేపు సరదాగా తిరిగాడు. ఒక చేత్తో పులి మెడకు చుట్టిన గొలుసు పట్టుకుని మరో చేత్తో దాన్ని నిమురుతూ వాకింగ్ చేశాడు. అది కూడా టూరిస్టుకు సహకరిస్తూ నడిచింది. ఈ క్రమంలో దాంతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. పులి పక్కన కూర్చోని సెల్ఫీ తీసుకోబోయాడు. ఈ క్రమంలో అది ఒక్కసారిగా గాండ్రించింది. ట్రైనర్ ఎదుటే అతడిపై పంజా విసిరింది.
అప్పటి వరకు శాంతంగా ఉన్న పులి ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. ఊహించని ఈ ఘటనతో ఆ టూరిస్ట్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పులి దాడిలో అతడికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు.
వీడియో చూడండి:
Apparently an Indian man attacked by a tiger in Thailand.
This is one of those paces where they keep tigers like pets and people can take selfies, feed them etc etc.#Indians #tigers #thailand #AnimalAbuse pic.twitter.com/7Scx5eOSB4
— Sidharth Shukla (@sidhshuk) May 29, 2025
