Viral Video: అడవి మధ్యలో ఆగిన ట్రక్.. అధికారులుగా మారి టోల్ టాక్స్ వసూలు చేసిన ఏనుగుల గుంపు

జంతువులకు ఇబ్బందులు కలగకుండా.. మనుషులకు కూడా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అడవులను నరికివేయకుండా రోడ్లు వేసిన అనేక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఎవరైనా వాహనాల్లో ఈ అడవులోని రహదారుల్లో ప్రయాణించే సమయంలో కొన్ని సార్లు అడవి లో నివసించే జంతువులు తరాసిపడిన ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అలంటి ఒక ఫన్నీ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Viral Video: అడవి మధ్యలో ఆగిన ట్రక్.. అధికారులుగా మారి టోల్ టాక్స్ వసూలు చేసిన ఏనుగుల గుంపు
Elephant Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 18, 2024 | 9:20 PM

టెంపర్‌మెంటల్ జంతువుల గురించి మాట్లాడితే.. ఏనుగుల పేరు అగ్రస్థానంలో వినిపిస్తోంది. భూమి మీద అతి పెద్ద జంతువు. అడవిలో  నివసించే ఏనుగు మానవుడి జీవితానికి పోలిక ఉంటుంది. అంతేకాదు జంతువుల్లో తనకంటూ ప్రత్యేక ఉనికిని కలిగి ఉంటుంది. ఏనుగుల ఆటతీరు, యజమాని పట్ల దాని ప్రేమ.. గున్న ఏనుగుల చేసే చిలిపి చేష్టలు ఇలా అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి  ప్రస్తుతం నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఈ వైరల్ వీడియో చూసిన ఎవరైనా మళ్ళీ ఏనుగు పనులను గుర్తు చేసుకుని సరదాగా నవ్వుకుంటారు.

ఈ భూమి అంతా అడవులతో నిండి.. ఆ అడవులు జంతువులతో నిండి ఉండేది.. అయితే కాల క్రమేణా మనిషి.. జంతువుల స్థావరం అయిన అడవులను ఆక్రమించుకుంటున్నాడు. అడవులను ధ్వంసం చేసి తన కోసం గ్రామాలను నిర్మించుకోవడం కోసం.. పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకోవడం మొదలుపెట్టాడు. అటువంటి పరిస్థితిలో భారీ సంఖ్యలో అడవి జంతువులు నాశనమయ్యాయి. అయితే జంతువులకు ఇబ్బందులు కలగకుండా.. మనుషులకు కూడా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అడవులను నరికివేయకుండా రోడ్లు వేసిన అనేక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఎవరైనా వాహనాల్లో ఈ అడవులోని రహదారుల్లో ప్రయాణించే సమయంలో కొన్ని సార్లు అడవి లో నివసించే జంతువులు తరాసిపడిన ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అలంటి ఒక ఫన్నీ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఏనుగు ప్రజల నుండి టోల్ టాక్స్ వసూలు చేస్తున్న వీడియోను చూడండి.

కమలా ఫలాలను ను డెలివరీ చేసే ఓ ట్రక్కు అడివిలో రహదారి గుండా వెళుతుండగా.. దారిలో అకస్మాత్తుగా ట్రక్ చక్రం పాడైనట్లుంది. అప్పుడు ట్రక్ డ్రైవర్ తన భాగస్వామితో కలిసి దాన్ని రిపేర్ చేస్తున్న సమయంలో ఏనుగులు ట్రక్ నిలిపి ఉన్న చోటకు వచ్చాయి. ఏనుగులు గుంపు ట్రక్ లోని కమలా ఫలాలను తొండంతో తీసుకుని హ్యాపీ తినడం ప్రారంభించాయి. అలా ఏనుగులు అన్నీ కలిపి కమలా ఫలాలతో విందు చేసుకున్నాయి. మరోవైపు డ్రైవర్స్ తమ టైర్ ని రిపేర్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.

వైరల్ అవుతున్న ఈ క్లిప్ దక్షిణాఫ్రికాకు చెందినది. 60 వేల మందికి పైగా నెటిజన్లు దీన్ని లైక్ చేసారు. రకరకాల కామెంట్స్ తో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు ‘మీరు అడవి గుండా వెళ్లాలంటే, మీరు పన్ను చెల్లించాలి’ అని రాశారు. మరొకరు  ‘ఈ టోల్ ఫీ చెల్లించడం చాలా ముఖ్యం’ అని రాశారు.ఇలా అనేక ఫన్నీ కామెంట్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..