Sirisilla: సీతారాములకు సిరిసిల్ల బంగారు పట్టు చీర.. ప్రధాని మోడీ చేతుల మీదుగా అందిస్తానన్న నేతన్న

దేశ ప్రధాని మన్నలను పొందిన వెల్ది హరిప్రసాద్. మరొక అద్భుతం తయారు చేయడానికి పూనుకున్నాడు. ఈ నెల 22 అయోధ్యలో నిర్మించిన రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అరుదైన కానుక చేనేత మగ్గం పై 20 రోజుల పాటు శ్రమించి బంగారు పట్టు చీర హరి ప్రసాద్ అతని సతీమణి రేఖతో కలిసి రూపొందించాడు. దీని ప్రత్యేకత ఈ చీర అంచులో అయోధ్య రామ మందిరం, శ్రీ రామ పట్టాభిషేకం, జై శ్రీరామ్ శ్రీరామ్ అంటూ తెలుగులో వచ్చే విధంగా మరో వైపు బార్డర్ కు జై శ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా చీర కొంగులో సీతా రాముల ప్రతిబింబం, చీరలో రామాయణంలోని 10 ఘట్టాలు నేయడం జరిగింది

Sirisilla: సీతారాములకు సిరిసిల్ల బంగారు పట్టు చీర.. ప్రధాని మోడీ చేతుల మీదుగా అందిస్తానన్న నేతన్న
Gold Saree For Lord Rama
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jan 18, 2024 | 8:04 PM

తెలంగాణ లోని సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్డి హరి ప్రసాద్ చేనేత కళాకారుడు అనునిత్యం నేత వృత్తిలో ఎన్నో అద్భుతాలు చేసి సిరిసిల్ల పేరు ప్రఖ్యాతలు దేశమంతా చర్చించేలా ప్రయోగాలు చేసిన నేతన్న హరి ప్రసాద్. అయోధ్య లో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేళ మరోసారి తన కళాదృష్టికి పని చెప్పారు. సీతమ్మవారి కోసం బంగారు చీరను రెడీ చేశారు.

హరి ప్రసాద్ తండ్రి పోషెట్టి కూడా నేత కార్మికుడే. చిన్నతనం నుండి తండ్రి చేస్తున్న పనులను చూస్తూ పెరిగాడు పోశెట్టి చేస్తున్న ప్రయోగాలు నిత్యం గమనిస్తూ, ఓ పక్క చదువుకుంటూనే కార్మిక క్షేత్రంలో పెరిగాడు. హరి ప్రసాద్ తనకున్న మేధా శక్తినీ కూడగట్టుకొని చేనేతలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట అగ్గిపెట్టలో ఇమిడే చీర సూది రంద్రంలో దురే చీర నేసి అబ్బురపరిచాడు. అంతటితో ఆగకుండా దేశంలో ఉన్న ప్రముఖ దేశ, విదేశాల ప్రాధానుల నేతల ముఖచిత్రాలు, న్యూజిలాండ్ ప్రధానమంత్రి ముఖచిత్రం వేసి ఆ ప్రధానికి పంపించాడు.

భారత రత్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోలు మగ్గం పై నేసి అందించాడు. మొన్న దేశంలో జరిగిన జి20 సదస్సు లోగో నేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందించి మన్నలను పొందాడు. 95 ఏపిసోడ్ మన్ కి బాత్ లో హరి ప్రసాద్ నేసిన చేనేత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎప్పుడు ఏదోక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. బుల్లి మర మగ్గం తయారు చేసి దానిపై వస్త్రాన్ని వేసి అందరినీ ఆశ్చర్యపడేలా చేశాడు.

ఇవి కూడా చదవండి

గత సంవత్సరం భద్రాద్రి సీతమ్మకు వెండి పట్టు పీతాంబరం చీర నేసి దేవాదాయ శాఖ అధికారులకు అందించాడు. ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న హరి ప్రసాద్ సిరిసిల్లకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలని ఉద్దేశంతో కార్మిక, ధార్మిక జిల్లా అయినా “రాజన్న సిరిపట్టు” అని నామకరణం చేసి రాజన్న సిరి పట్టు అనే బ్రాండ్ మీద దేశ, విదేశాలకు విస్తరించేలా చేశాడు.

తెలంగాణ లోనే మొదటి డబుల్ పేటి మర మగ్గం తయారు చేసుకొని అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నాడు. దేశ ప్రధాని మన్నలను పొందిన వెల్ది హరిప్రసాద్. మరొక అద్భుతం తయారు చేయడానికి పూనుకున్నాడు. ఈ నెల 22 అయోధ్యలో నిర్మించిన రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అరుదైన కానుక చేనేత మగ్గం పై 20 రోజుల పాటు శ్రమించి బంగారు పట్టు చీర హరి ప్రసాద్ అతని సతీమణి రేఖతో కలిసి రూపొందించాడు. దీని ప్రత్యేకత ఈ చీర అంచులో అయోధ్య రామ మందిరం, శ్రీ రామ పట్టాభిషేకం, జై శ్రీరామ్ శ్రీరామ్ అంటూ తెలుగులో వచ్చే విధంగా మరో వైపు బార్డర్ కు జై శ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా చీర కొంగులో సీతా రాముల ప్రతిబింబం, చీరలో రామాయణంలోని 10 ఘట్టాలు నేయడం జరిగింది. చీరలో రామ జననం నుంచి  పట్టాభిషేకం అయ్యే వరకు రామాయణం గాథనునేశాడు.

అంతేకాకుండా చీరలో జై శ్రీరామ అంటూ శ్రీరామ నామాలు వచ్చే విధంగా ఈ చీరను ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో నేశామని హరిప్రసాద్ వెల్లడించారు. ఈ చీర 900 గ్రాములు ఉంటుందనీ ఇందులో 8 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి పట్టు దారాలతో తయారు చేసినట్లు హరి ప్రసాద్ దంపతులు చెప్పారు.

భారత ప్రభుత్వం నుంచి ప్రతి జనవరి 26కు దేశంలో కొందరికి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందుతుంటాయి. ఈ సారి భారత ప్రభుత్వ నుండి హరి ప్రసాద్ దంపతులకు అలాంటి జాబితాలో ఆహ్వానం అందింది. ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీకి రావాలని ఆహ్వానం అందింది. ఈ చీరను మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి చూపించి అయోధ్య ప్రాణ ప్రతిష్ట అయిన శ్రీ సీతా రామయ్యలకు అందిస్తానని హరిప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే