Viral video: బాబోయ్.. ఈ బామ్మ ఎనర్జీ మామూలుగా లేదు.. అద్దిరిపోయే డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా
వైరల్ వీడియోలో కజరారే పాటకు ఆ బామ్మ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లిరిక్స్‌కు తగినట్లుగా హవాభావాలను పలికిస్తూ అదిరిపోయే స్టెప్పులతో నెటిజన్లను ఫిదా చేసింది. వావ్ బామ్మ, వాట్ ఏ డ్యాన్స్..ఎంత ఎనర్జీ అంటూ నెటిజన్లు బామ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో అనేక డ్యాన్స్ రీల్స్ చూస్తుంటాం. అలాంటి వీడియోలు కొన్ని హృదయాన్ని తాకుతాయి. కానీ ఈ రోజు మనం చూడబోయేది కేవలం వైరల్ వీడియో కాదు, మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించిన ఒక బామ్మ చేసిన సూపర్ క్యూట్ డ్యాన్స్ వీడియో. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ, ఒక వృద్ధురాలు హిందీలోని ఓ సూపర్ హిట్ పాటకు డ్యాన్స్ చేస్తోంది. ఇది ఆమె మనవడి పెళ్లిలో జరిగిన మెహందీ ఫంక్షన్ వేడుక సందర్భంలో అని తెలిసింది. ఇప్పటివరకు, 77 మిలియన్లకు పైగా ప్రజలు ఈ అందమైన వీడియోను వీక్షించారు.
అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ నటించిన బంటీ ఔర్ బబ్లీ చిత్రంలోని సూపర్ హిట్ పాట ‘ కజ్రా రే ‘ నైనా అనే సూపర్‌హిట్ సాంగ్‌కి అమ్మమ్మ అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఆమెతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా చప్పట్లు కొడుతూ ఆమెను ఉత్సాహపరిచారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. ఆ వీడియో కామెంట్ బాక్స్ పూర్తిగా సూపర్ క్యూట్ లాంటి వ్యాఖ్యలతో నిండిపోయింది. చూడటానికి చాలా ఆనందంగా ఉంది. మీరు దీన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
వైరల్ వీడియోలో కజరారే పాటకు ఆ బామ్మ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లిరిక్స్‌కు తగినట్లుగా హవాభావాలను పలికిస్తూ అదిరిపోయే స్టెప్పులతో నెటిజన్లను ఫిదా చేసింది. వావ్ బామ్మ, వాట్ ఏ డ్యాన్స్..ఎంత ఎనర్జీ అంటూ నెటిజన్లు బామ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..