Oarfish: సముద్ర తీరంలో అరుదైన చేప.. ఇలా ఒడ్డుకు రావడం మంచిది కాదంటున్న శాస్త్రవేత్తలు

Oarfish: ప్రకృతిలో అనేక వింతలకు నిలయాలు. సమస్త భూమండలంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు దాగున్నాయి. ఇక మహా సముద్రాలు(Maha Samudralu) రకరకాల జాతుల చేపలు, విచిత్ర జీవులకు..

Oarfish: సముద్ర తీరంలో అరుదైన చేప.. ఇలా ఒడ్డుకు రావడం మంచిది కాదంటున్న శాస్త్రవేత్తలు
Live Oarfish
Follow us
Surya Kala

|

Updated on: Apr 29, 2022 | 3:15 PM

Oarfish: ప్రకృతిలో అనేక వింతలకు నిలయాలు. సమస్త భూమండలంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు దాగున్నాయి. ఇక మహా సముద్రాలు(Maha Samudralu) రకరకాల జాతుల చేపలు, విచిత్ర జీవులకు నిలయాలు. ఇటీవల సముద్రతీరాల్లో విచిత్రమైన జీవులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట… మెక్సికో(Mexico) తీరంలో 13 అడుగుల ఓర్ చేప కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తాజాగా అదే జాతికి చెందిన మరో ఓర్ చేప న్యూజిలాండ్‌లో దర్శనమిచ్చింది. న్యూజిలాండ్‌లో( New Zealand) సముద్ర తీరానికి ఈ పెద్ద చేప కొట్టుకొచ్చింది. అయితే ఇది బతికే ఉంది. ఈ చేపను మొదట స్థానిక వ్యక్తి ఒకరు చూశారు. మొదట దానిని చూసి షార్క్‌ ఫిష్‌ అనుకున్నారు. దానిని వీడియోకూడా తీసారు. కానీ అది ఓర్‌ ఫిష్‌ అని, ఇవి చాలా అరుదైన చేపలని.. ఇవి ఇంకా జీవించి ఉండటం నమ్మలేని విషయం అంటున్నారు సముద్ర జీవ శాస్త్ర పరిశోధకులు.

కాగా ఓర్ చేపలు చాలా పెద్దగా, పొడవు పెరుగుతాయి. న్యూజిలాండ్‌లోని అరామోనా (Aramoana) బీచ్‌కి ఈ చేప కొట్టుకొచ్చింది. అయితే ఈ ఫిస్‌ ఇలా ఒడ్డుకు కొట్టుకు రావడం మంచి సంకేతం కాదు అంటున్నారు డాక్టర్ అల్లన్. సముద్రంలో సమస్యలు ఏర్పడితేనే అవి అలా ఒడ్డుకు వస్తాయన్నారు. ఇవి మనుషుల కంట పడటం చాలా అరుదని, సముద్ర లోతుల్లోనే ఇవి ఎక్కువ సంచరిస్తాయని చెప్పారు. ఇలా ఒడ్డుకి వచ్చినప్పుడు మాత్రమే చూడగలమని అంటున్నారు. ఇవి ఎప్పుడూ మనుషులకు హాని చెయ్యలేదని తెలిపారు. ఈ చేప వీడియోని ఒటాగో యూనివర్శిటీకి చెందిన డాక్టర్ బ్రిడీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు . కాగా ఈ చేపను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రకరకాల కామంట్లు చేస్తూ వీడియోను లైక్‌ చేస్తున్నారు.

Also Read:  Bird Flu: అమెరికాలో మొదటిసారిగా మనిషికి బర్ద్ ఫ్లూ.. కోళ్ల నుంచి సంక్రమించిందని అనుమానం.. పరిశీలనలో 2,500 మంది

Nara Lokesh: అట్టుంటది ఒక్క చాన్స్ తోని.. మంత్రి కేటీఆర్ వీడియో షేర్ చేసిన నారా లోకేష్..

ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..