Viral Video: నిజంగా గరుత్మంతుడే వచ్చి వెళ్లాడా?… పూరి జగన్నాథ్ టెంపుల్ మీద అద్భుత దృశ్యం…
ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుడి ఆలయం దగ్గర ఊహించని సంఘటన జరిగింది. ఎంతో పరమ పవిత్రంగా భావించే పూరీ శ్రీ మందిరం గోపురం జెండాను ఓ గరుడ పక్షి ఎత్తుకెళ్లింది. శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, అది...

ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుడి ఆలయం దగ్గర ఊహించని సంఘటన జరిగింది. ఎంతో పరమ పవిత్రంగా భావించే పూరీ శ్రీ మందిరం గోపురం జెండాను ఓ గరుడ పక్షి ఎత్తుకెళ్లింది. శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, అది శ్రీ మందిరం గోపురంపై ఉండే జెండా ముక్కనా కాదా అనేదాని మీద స్పష్టత రాలేదు. గుడ్డ ముక్కను నోటితో కరుచుకున్న తర్వాత ఆ గరుడ పక్షి సముద్రం వైపు ఎగిరుకుంటూ పోయింది. కొద్దిసేపటి తర్వాత గాల్లోనే కనిపించకుండా పోయింది. గరుడ పక్షి ఎత్తుకెళ్లిన గుడ్డ ముక్కపై గుడి అధికారుల నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ జెండాను ‘పతితపావన బనా’ అని స్థానిక భక్తులు పిలుస్తారు. జెండాను ప్రతీ రోజు మారుస్తూ ఉండటం ఇక్కడి సాంప్రదాయం.
వైరల్ అవుతున్న దృశ్యాలు శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. జెండా మిస్టరీ గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇదంతా ఆ దేవదేవుడి మహిమే అని చెబుతున్నారు. ఆలయ అధికారులు స్పందిస్తే గానీ ఆ వీడియోలో నిజం ఎంత ఉందో అసలది జెండా గుడ్డ ముక్కనో కాదో స్పష్టత వచ్చే అవకాశం లేదు.
ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు స్పందిన్నారు. పరమ పవిత్రమైన ఆ జెండా ముక్కను గరుత్మంతుడు ఎత్తు కెళ్లాడు. చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంది అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదంతా దేవుడి లీల.. ఆ గ్రద్ద జెండాను ఎత్తుకెళ్లి .. సముద్రం వైపు వెళ్లి మాయమైంది. అది కచ్చితంగా దేవుడి దగ్గరకు వెళ్లి ఉంటుంది అంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పూరీ జగన్నాథుడి ఆలయంలో అంతుచిక్కని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో జెండా కూడా అంతుబట్టని రహస్యమే. సాధారణంగా ఏదైనా వస్తువు.. గాలి ఎటు వీస్తే అటు వైపుగా వెళతాయి. ఇక గుడ్డ ముక్క అయితే గాలి వీస్తున్న వైపు రెపరెపలాడుతుంది. కానీ, పూరి శ్రీ మందిరం గోపురం పైన ఉండే జెండా మాత్రం గాలి వీస్తున్న వైపు కాకుండా వ్యతిరేకంగా రెప రెపలాడుతుంది. ఇలా ఎందుకు జరుగుతోందో ఎవ్వరికీ అంతుచిక్కటం లేదు. భక్తులు దీన్ని పూరీ జగన్నాథుడి మహిమగా చెబుతుంటారు.
వీడియో చూడండి:
A viral video shows an eagle flying over the Puri Jagannath Temple carrying the ‘Patitapaban Bana’. The scene has stirred up social media — some see it as divine, while others find it mysterious. pic.twitter.com/aQ7IlYO4gF
— Voice Of Sanatan (@Ritik_Sanatani) April 14, 2025
This picture raise lots of questions!!! An eagle fled after taking Patitapabana flag from the top of the #Jagannattemple #puri pic.twitter.com/8Zlc74UUj0
— Ajay kumar nath (@ajaynath550) April 13, 2025