Viral Video: అందంగా జనగణమన ఆలపిస్తున్న చిన్నారి దేవ దూత.. అందరినీ అలరిస్తోన్న క్యుట్ గర్ల్ వీడియో

సోషల్ మీడియాలో రోజూ పక్షులు, జంతువులు, వంటలు ఇలా రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో ఒక చిన్నారి బాలిక స్కూల్ లో జాతీయ గీతాన్ని ఎంతో ఉత్సాహంగా ఆలపిస్తోంది. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ఆ బాలికను న్యూఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానించమని కోరారు.

Viral Video: అందంగా జనగణమన ఆలపిస్తున్న చిన్నారి దేవ దూత.. అందరినీ అలరిస్తోన్న క్యుట్ గర్ల్ వీడియో
A Mighty Nations Anthem

Updated on: Aug 13, 2025 | 12:20 PM

ఒక చిన్న అమ్మాయి తన పాఠశాలలో జాతీయ గీతాన్ని ఉత్సాహంగా పాడుతున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బిజెపి నాయకుడు షేర్ చేశారు. ఇప్పటివరకు 1.4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక పాఠశాలకు చెందిన ఈ వీడియోలో ఒక చిన్నారి జాతీయ గీతం ఆలపిస్తూ తన సొంత ప్రపంచంలో మునిగిపోయి. నేపథ్యంలో బ్యాండ్ వాయిస్తుండగా జాతీయ గీతాన్ని ఉత్సాహంగా పాడుతూ కనిపించింది.

“అరుణాచల్‌లో ఎక్కడో ఒక చిన్న స్వరం ఒక శక్తివంతమైన దేశ గీతాన్ని ప్రతిధ్వనిస్తూ.. ప్రపంచానికి “నేను భారతదేశం, భారతదేశం నేనే” అని తెలియజేస్తోంది” అని బిజెపి నాయకుడు తన సోషల్ మీడియా X లో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

బాలిక జాతీయ గీతం పాడుతున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియోలోని చిన్నారిపై నెటిజన్లు ప్రశంస వర్షం కురిపిస్తున్నారు. భవిష్యత్ తరాలను మన దేశ రక్షకులుగా అభివర్ణిస్తున్నారు. భారతదేశపు ఈ కుమార్తెలు, మనవరాళ్ళు దేశాన్ని రక్షించే గర్వించదగిన రక్షకులుగా ఉంటారు. వీరే మన గర్వం, అందం, బలం అని చెబుతున్నారు. “ఇంత చిన్న అమ్మాయి తన దేశభక్తిని తన హావభావాల ద్వారా వెల్లడిస్తుంది. నిజంగా అద్భుతం” అని మరొకరు అన్నారు. ఇలాంటి యువ దేశభక్తులతో దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంది. జై హింద్” అని చెప్పారు. మరొకరు ఆగస్టు 15న జరిగే స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఆమెను ఆహ్వానించండి అని చెప్పారు. ఒకరు ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా గురించి ప్రస్తావిస్తూ ఆ అమ్మాయిని న్యూఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానించమని కోరారు.

“@PMOIndia @HMOIndia దయచేసి ఆగస్టు 15న ఎర్రకోట లో జాతీయ గీతాన్ని ఆలపించడానికి ఈ చిన్న దేవదూతను ఆహ్వానించండి” అని ఆయన అన్నారు.

హర్ష్ గోయెంకా అలాంటి మరో అందమైన వీడియోను పంచుకున్నారు.

గత సంవత్సరం ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఒక చిన్న పిల్లవాడు ఇతర విద్యార్థులతో కలిసి పూర్తి ఉత్సాహంతో, అంకితభావంతో జాతీయ గీతాన్ని పాడుతున్నాడు.

ఈ వీడియోను వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా తన అధికారిక X హ్యాండిల్‌లో షేర్ చేశారు.

“మన జాతీయ గీతాన్ని లెక్కలేనన్ని సార్లు పాడవచ్చు. కానీ ఈ గీతాన్ని ఒక చిన్న హృదయం మనస్పూర్తిగా ఆలపించడం నిజంగా అందరినీ అలరిస్తుంది. నవ్వకుండా ఉండటం అసాధ్యం!” అని ఆయన పోస్ట్ చేశారు.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..