AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీనుల విందుగా హ్యారీ పోటర్ థీమ్ సాంగ్‌ను హమ్ చేస్తోన్న హమ్మింగ్ బర్డ్.. గాత్రానికి 10కి 15 మార్కులు వేసిన నెటిజన్లు

Humming Bird: ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social Media) అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెంపుడు జంతువులు, పక్షులు, ఏనుగులు ఇలా రకరకాల వీడియాలు..

Viral Video: వీనుల విందుగా హ్యారీ పోటర్ థీమ్ సాంగ్‌ను హమ్ చేస్తోన్న హమ్మింగ్ బర్డ్.. గాత్రానికి 10కి 15 మార్కులు వేసిన నెటిజన్లు
Bird Singing Harry Potter T
Surya Kala
|

Updated on: May 01, 2022 | 1:11 PM

Share

Humming Bird: ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social Media) అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెంపుడు జంతువులు, పక్షులు, ఏనుగులు ఇలా రకరకాల వీడియాలు నెట్టింట్లో హల్ చేస్తూ.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. పక్షుల్లో అయితే రామచిలుక మాటలు, పాటలు, నెమలి నాట్యం వంటి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటున్నాయి. తాజాగా ఓ లిటిల్ హమ్మింగ్ బర్ద్ కు సంబంధించిన ఓ వీడియో సందడి చేస్తోంది.

ఈ లిటిల్ హమ్మింగ్ బర్డ్‌ యజమాని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో హమ్మింగ్ బర్ద్ తన యజమానురాలు భుజంపై కూర్చుని హ్యాపీగా హాలీవుడ్ సూపర్ హిట్ మూవీలోని సాంగ్ ను హమ్ చేస్తోంది. ఈ వీడియోలో పాడుతూ కనిపించే ఈ పక్షి పేరు జెఫిర్. ఈ పక్షి 2018 మే నెలలో పార్కింగ్ స్థలం నుండి రక్షించిన ఫెర్న్ అనే మహిళ అప్పటి నుంచి తానే పెంచుకుంటుంది. ఇద్దరూ కలిసి నివసిస్తారు. ఇద్దరూ కలిసి చాలా సరదాగా గడుపుతారు. అంతేకాదు జెఫిర్, తాను కలిసి ఉన్న వీడియోలను తరచూ తమ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ రెండింటిలోనూ పోస్ట్ చేస్తుంది ఫెర్న్.  హమ్మింగ్ బర్ద్ హమ్ చేస్తున్న ఈ సాంగ్ వీడియో మొదట టిక్‌టాక్‌లో,  తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో యానిమల్స్ డూయింగ్ థింగ్స్ అనే పేజీలో షేర్ చేయబడింది.  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న ఇంగ్లీష్‌ బ్లాక్ బస్టర్ సిరీస్‌ హ్యారీ పోటర్ కు సంబంధించిన థీమ్ సాంగ్ ను గొంతెత్తి వీనుల విందుగా ఆలపిస్తోంది.

తనదైన స్టైల్ లో హమ్మింగ్ బర్డ్ ఈ థీమ్ సాంగ్ ను ఆకట్టుకునే పడడంతో సంగీత ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాట పాడిన బర్డ్ చిన్ని గొంతుపై నెటిజన్లు ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు. ఈ థీమ్‌ సాంగ్‌ను ఆ పక్షి ఆపకుండా కొన్ని సెకండ్ల పాటు ఏకబిగిన పాడుతోంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌గా మారి 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ ను, 1,879,665 మంది లైక్స్ ను సొంతం చేసుకుంది. పక్షిని సోషల్‌ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ఈ పక్షి తన గానంతో గాత్రంతో 10కి 15 మార్కులను సొంతం చేసుకుందని ఒకరు కామెంట్ చేస్తే.. ఇలా ఆపకుండా ఏక బిగిన చిన్న పక్షి పాడడం గొప్ప అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి మీరు కూడా హమ్మింగ్ బర్డ్ గాత్రాన్ని వీనుల విందుగా వినండి మరి

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: 

Manna Dey: స్వర మాధుర్యంతో మనసు హత్తుకునే మధుర గీతాలకు పెట్టిన పేరు మన్నాడే!

Akshaya Tritiya 2022: మీరు అక్షయ తృతీయ రోజున బంగారు నాణేలు కొంటున్నారా.. ఈ 5 విషయాలను తెలుసుకోండి