AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: విమానం గాల్లో ఉండగా ఊహించని సీన్… భయాందోళనలో ప్రయాణికులు

ఇటీవల కాలంలో విమాన ప్రయాణం అంటేనే భయం పుట్టే పరిస్థితులు నెలకొన్నాయి. అంతా సవ్యంగా ఉంది.. విమానం గాల్లో ఎగుతుంది అనుకునేలోపే ఊహించని దారుణాలు జరిగిపోతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్నా.. ఏపక్కన ఏ డోరు ఊడిపోతుందో.. ఏ కిటిటీ ఊడిపోతుందో.. ఏ క్యాబిన్‌లో ఏ పాము ఉందో...

Viral Video: విమానం గాల్లో ఉండగా ఊహించని సీన్... భయాందోళనలో ప్రయాణికులు
Spicejet Flight Window Brea
K Sammaiah
|

Updated on: Jul 03, 2025 | 8:30 PM

Share

ఇటీవల కాలంలో విమాన ప్రయాణం అంటేనే భయం పుట్టే పరిస్థితులు నెలకొన్నాయి. అంతా సవ్యంగా ఉంది.. విమానం గాల్లో ఎగుతుంది అనుకునేలోపే ఊహించని దారుణాలు జరిగిపోతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్నా.. ఏపక్కన ఏ డోరు ఊడిపోతుందో.. ఏ కిటిటీ ఊడిపోతుందో.. ఏ క్యాబిన్‌లో ఏ పాము ఉందో.. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవుతుందో లేదో అనే ఆందోళన తప్పడంలేదు ప్రయాణికులకు. తాజాగా గాల్లో విమానం ఎగురుతుండగా కిటికీ ఫ్రేమ్‌ ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పుణె నుంచి గోవా వెళ్తున్న స్పైస్‌జెట్ క్యూ400 విమానంలో ఒక ప్రయాణికుడు కూర్చున్న సీటు వద్ద ఉన్న కిటికీ ఫ్రేమ్ అకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో ఆ ప్రయాణికుడు విమానం భద్రత, నిర్వహణపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆ వీడియోను ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై స్పైస్‌జెట్ సంస్థ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని స్పష్టం చేసింది. ఊడిపోయింది కిటికీ అద్దం కాదని, కేవలం లోపలి వైపు ఉండే కాస్మెటిక్ ఫ్రేమ్ మాత్రమేనని తెలిపింది. క్యూ400 విమానాల్లో కిటికీలకు బహుళ పొరల పలకలు ఉంటాయి. ఇందులో బయటి వైపు ఉండే పలక చాలా దృఢంగా, అధిక పీడనాన్ని తట్టుకునేలా ఉంటుంది. అందువల్ల ప్రయాణికుల భద్రతకు ఎప్పుడూ ముప్పు వాటిల్లదని స్పైస్‌జెట్ తన ప్రకటనలో పేర్కొంది.

లోపలి ఫ్రేమ్ కేవలం నీడ కోసం, అలంకరణ కోసం అమర్చినదని, అది విమాన నిర్మాణంలో కీలక భాగం కాదని సంస్థ వివరించింది. విమానం పుణెలో ల్యాండ్ అయిన తర్వాత, ప్రామాణిక నిర్వహణ పద్ధతులను అనుసరించి ఆ ఫ్రేమ్‌ను తిరిగి బిగించినట్లు స్పైస్‌జెట్ వెల్లడించింది. ఈ ఘటన వల్ల విమానంలోని పీడనంలో ఎలాంటి మార్పు రాలేదని, అంతా సాధారణంగానే ఉందని కూడా స్పష్టం చేసింది.

వీడియో చూడండి: