AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి యువతకు స్పూర్తి ఈ బామ్మ.. పెట్రోల్ బంకులో పని చేస్తూ స్వతంత్రగా జీవిస్తోన్న 70 ఏళ్ల వృద్ధురాలు

నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధురాలే నేటి తరం యువతకు ఆదర్శం. ఒక బామ్మ పెట్రోల్ బంకులో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. నేను ఇప్పుడు వృద్దురాలిని పని చేయలేను.. నన్ను నా పిల్లలే చూసుకోవాలి..ఇది వారి బాధ్యత అంటూ భావించకుండా పని చేయడంలోని ఆనందాన్ని అనుభవిస్తూ కష్టపడి పని చేసి సంపాదించుకుంటూ  జీవిస్తోంది. బామ్మ స్ఫూర్తిదాయకమైన కథకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నేటి యువతకు స్పూర్తి ఈ బామ్మ.. పెట్రోల్ బంకులో పని చేస్తూ స్వతంత్రగా జీవిస్తోన్న 70 ఏళ్ల వృద్ధురాలు
Viral Video
Surya Kala
|

Updated on: Jun 26, 2024 | 12:49 PM

Share

కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని శ్రీ శ్రీ అన్న మాటను నిజం చేస్తూ నేటి తరం యువతలో కొందరు తమ చదువుకు తగిన ఉద్యోగం రాలేదని.. జీతం లేదని ఇలా రకరకాల కారణాలు చెబుతూ ఏ పని చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నారు.. మరికొందరు నిరాశతో ప్రాణాలను అర్ధంతరంగా ముగిస్తున్నారు కూడా.. చిన్న చిన్న కష్టాలకే జీవితం ఇంతే అంటూ నిరాస నిసృహలకు లోనయ్యే ఈ తరం వారికి కొంతమంది వృద్ధులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వయసుతో సంబంధమ ఏముంది పని చేయాలనే ఉత్సాహం చేసే పని మీద శ్రద్ధ గౌరవం ఉంటే చాలు అని చెబుతున్నారు. తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధురాలే నేటి తరం యువతకు ఆదర్శం. ఒక బామ్మ పెట్రోల్ బంకులో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. నేను ఇప్పుడు వృద్దురాలిని పని చేయలేను.. నన్ను నా పిల్లలే చూసుకోవాలి..ఇది వారి బాధ్యత అంటూ భావించకుండా పని చేయడంలోని ఆనందాన్ని అనుభవిస్తూ కష్టపడి పని చేసి సంపాదించుకుంటూ  జీవిస్తోంది. బామ్మ స్ఫూర్తిదాయకమైన కథకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చాలా మంది సీనియర్లు వయస్సు కేవలం ఒక సంఖ్య అని నిరూపిస్తూనే ఉన్నారు. జీవితంపై ఆసక్తి.. పని చేయాలనే ఉత్సాహం ఉంటే చాలు.. ఎ పని చేయలన్నా కష్టం కాదు అలాగే కేరళలో 70 ఏళ్లు దాటిన ఓ బామ్మ కూడా వయసు పని చేయడానికి అడ్డుకాదని నిరూపించింది. ఈ వయసులో కూడా మూలం కడక్‌లోని ఓ పెట్రోల్‌ బంకులో రాత్రింబవళ్లు పనిచేస్తూ ఎవరికీ భారం పడకుండా సొంతంగా జీవిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

కేరళ ఫోటోగ్రాఫర్ పొన్ను సూర్య (@పొన్నుసూర్యర్) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో.. దాదాపు 70 ఏళ్లు వయస్సు దాటిన ఓ వృద్ధురాలు పెట్రోల్ బంకులో వాహనాలకు పెట్రోల్ , డీజిల్ నింపుతోంది. బామ్మ పని చేస్తున్న తీరు ఎవరి హృదయాన్ని అయినా సరే కదిలించే దృశ్యమని చెప్పవచ్చు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో 4.2 మిలియన్ల వ్యూస్ అంటే 42 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. కష్టపడి పనిచేస్తున్న ఈ బామ్మ స్ఫూర్తిదాయకమైన కథ నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..