AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అక్క డ్రైవింగ్ చూస్తే చుక్కలే..! రాంగ్‌రూట్‌లో రయ్‌మంటూ దూసుకెళ్లింది..కట్‌చేస్తే…

రోడ్డు ప్రమాదాల వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో అనేకం కనిపిస్తున్నాయి. ఇటీవల, అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది రోడ్డు భద్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల కలిగే ప్రమాదాలను వివరిస్తుంది. ఈ వీడియోలో, ఒక మహిళ తన స్కూటర్‌పై వేగంగా వెళుతూ రద్దీగా ఉండే రోడ్డును దాటడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరుగుతుంది. ఆ తరువాత ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే..

ఈ అక్క డ్రైవింగ్ చూస్తే చుక్కలే..! రాంగ్‌రూట్‌లో రయ్‌మంటూ దూసుకెళ్లింది..కట్‌చేస్తే…
Dangers Of Negligent Driving
Jyothi Gadda
|

Updated on: Nov 10, 2025 | 11:03 AM

Share

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ తన స్కూటర్‌తో రోడ్డు మధ్యలో వేగంగా వెళ్తోంది. అది కూడా రాంగ్‌ రూట్లో వెళ్తోంది. ఆమె అనేక వాహనాలను తప్పించుకుంటూ రోడ్డుకు అటు ఇటుగా వెళ్తోంది. కానీ, చివరికి ఆమె స్పీడ్‌ని ఏ మాత్రం తగ్గించుకోకుండా రోడ్డుపై ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమ వైపు చూడకుండా రోడ్డు దాటడం ప్రారంభిస్తుంది. కానీ, వెనుక నుండి వస్తున్న ట్రక్కు ఆమె స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. దాంతో సదరు యువతి స్కూటర్ తో పాటు కింద పడిపోయింది.

ఆ మహిళ తన స్కూటర్ తో పాటు రోడ్డు మీద పడిపోతుంది. ఆమె తొందరపడి దాటడం ఎంత ప్రమాదకరమో ఆమెకు తెలియదు. రద్దీగా ఉండే రోడ్డులో ట్రాఫిక్ ఉన్నప్పటికీ ఆ మహిళ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ఆమె పూర్తిగా రోడ్డుపై దృష్టి పెట్టలేదని సూచిస్తుంది. ఆ మహిళ ఎలా పడిపోతుందో వీడియో స్పష్టంగా చూపిస్తుంది. అదృష్టవశాత్తూ, ట్రక్ డ్రైవర్ అత్యవసర బ్రేక్ వేసి ఆమె ప్రాణాలను కాపాడాడు. లేకపోతే, ట్రక్ స్పీడ్‌గా వెళ్లి ఉంటే..అది ఆమెపైకి దూసుకెళ్లి ఉండేది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ప్రమాద వీడియోను @MohiniWealth అనే యూజర్ సోషల్ మీడియా సైట్ Xలో షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలాది సార్లు చూశారు. వేలాది మంది లైక్ చేశారు. ఈ వీడియోకు చాలా కామెంట్లు వచ్చాయి. కొందరు ఆ మహిళ నిర్లక్ష్యంగా వాహనం నడపడాన్ని తీవ్రంగా విమర్శించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..