AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వార్నీ తాగుబోతు శునకం.. మత్తులో ఏం చేసిందో చూస్తే నవ్వి నవ్వి కడుపుబ్బి పోవాల్సిందే..

పెంపుడు జంతువులు మద్యం తాగిన తర్వాత వింతగా ప్రవర్తిస్తున్నట్లు చూపించే అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు, పెంపుడు కుక్క దాని యజమాని తాగుతున్ మద్యం తాగేసింది. ఆ తరువాత ఏం జరిగిందో చూపించే వీడియో వైరల్ అవుతోంది. తరువాత ఏం జరిగిందో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే.

Viral Video: వార్నీ తాగుబోతు శునకం.. మత్తులో ఏం చేసిందో చూస్తే నవ్వి నవ్వి కడుపుబ్బి పోవాల్సిందే..
Pet Dog Drank Alcohol
Jyothi Gadda
|

Updated on: Nov 10, 2025 | 9:30 AM

Share

మద్యం.. తాగిన వాళ్లను తరచూ స్పృహా కోల్పోయేలా చేస్తుంది. అందుకే మద్యం తాగిన మనుషులు తరచూ అర్ధంలేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే, జంతువులు తాగితే, అవి కూడా దారితప్పే అవకాశం ఉంటుంది. పెంపుడు జంతువులు మద్యం తాగిన తర్వాత వింతగా ప్రవర్తిస్తున్నట్లు చూపించే అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు, పెంపుడు కుక్క దాని యజమాని తాగుతున్ మద్యం తాగేసింది. ఆ తరువాత ఏం జరిగిందో చూపించే వీడియో వైరల్ అవుతోంది. తరువాత ఏం జరిగిందో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే.

తాగిన కుక్క ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది. ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. వైరల్‌ వీడియోలో ఒక హస్కీ కుక్క తన యజమాని మద్యం గ్లాసులోంచి మద్యాన్ని తాగుతూ కనిపిస్తుంది. తరువాత అది స్పృహ కోల్పోవటంతో దాని యజమాని నోట మాట రాలేదు.

రెడ్డిట్‌లో వైరల్ అయిన ఈ వీడియో పట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు బాగా ఎంజాయ్ చేశారు. కొంతమంది వినియోగదారులు దీనిని చాలా వినోదాత్మకంగా అభివర్ణించగా, మరికొందరు దీనిని పెంపుడు జంతువుల పట్ల క్రూరత్వం అని అభివర్ణించారు. కొందరు దీని వెనుక ఉన్న బాధ్యత గురించి, పెంపుడు జంతువుల పట్ల అలాంటి ప్రవర్తన సరైనది కాదు అని కూడా వ్యాఖ్యనించారు. వీడియోలోని ఒక కుక్క వింత ప్రవర్తన అందరికీ నవ్వు తెప్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన రెడ్డిట్ ప్లాట్‌ఫామ్‌ వేదికగా వైరల్ కావడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాగిన మైకంలో కుక్క అల్లరి గురించి జోకులు వేస్తూ విపరీతంగా ట్రోల్‌ చేశారు. అయితే, ఈ సంఘటన పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటూ ప్రమాదకరమైన వస్తువులకు దూరంగా ఉంచడం ఎంత ముఖ్యమో అనే అవగాహనను కూడా పెంచింది.

వీడియో ఇక్కడ చూడండి…

Viral husky byu/New_Major5251 inindianmemer

పెంపుడు జంతువులను రక్షించడం చాలా ముఖ్యమని ఈ వీడియో ప్రజలకు నేర్పింది. అవి వ్యసనాలకు గురికాకుండా చూసుకోవడం, అలాంటి ప్రమాదాలను ఎదుర్కోకుండా వాటిని సరిగ్గా చూసుకోవడం మన కర్తవ్యం. ఈ వీడియోను సోషల్ మీడియాలో వేలాది మంది వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..