AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Crab: అడవిలో అందమైన పీత.. ప్రకృతి ప్రసాదించిన విలువైన బహుమతి అంటున్న చూపరులు

ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. వాటిని చూసినప్పుడు నిజంగా షాక్ అవుతాం.. అలాంటి ఒక వింత జీవి వెలుగులోకి వచ్చింది. దీనిని చూసిన తర్వాత అటవీ అధికారులే కాదు సామాన్యులు కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన పీత. దాని ప్రకాశవంతమైన రంగు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనిని ప్రకృతి ప్రసాదించిన విలువైన బహుమతి అని అంటున్నారు.

King Crab: అడవిలో అందమైన పీత.. ప్రకృతి ప్రసాదించిన విలువైన బహుమతి అంటున్న చూపరులు
Rare King Crab
Surya Kala
|

Updated on: Aug 16, 2025 | 2:45 PM

Share

థాయిలాండ్‌లోని కేంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో చాలా అరుదైన, ప్రత్యేకమైన పీత జాతి కనిపించింది. దీని ప్రకాశవంతమైన ఊదా రంగు ఇంటర్నెట్‌లో ప్రజలను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని చిత్రాలలో ఈ పీత అందం స్పష్టంగా కనిపిస్తుంది. పార్క్ రేంజర్లు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రత్యేక పీతలను చూసి వాటిని కెమెరాలో బంధించారని చెప్పారు. పార్క్ పర్యవేక్షణ సిబ్బంది ఈ ఆవిష్కరణను ప్రకృతి ప్రసాదించిన విలువైన బహుమతిగా పేర్కొంది. ఆ పీతల చిత్రాలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది.

అటవీ పర్యావరణ వ్యవస్థ, జీవవైవిధ్యానికి అటువంటి అరుదైన జాతి ఉనికి ఎంత ముఖ్యమో తెలియజేసేందుకు కాయెంగ్ క్రాచన్ నేషనల్ పార్క్ ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంది. ఈ కింగ్ క్రాబ్ మనుగడ అడవి ఆరోగ్యంగా, సురక్షితంగా ఉందని.. తమ ప్రకృతి పరిరక్షణ ప్రయత్నాలు విజయవంతం అవుతున్నాయని.. అందుకు ఇదే సాక్షం అని చెబుతున్నారు.

దాని సంకేతం ఏమిటి? పార్క్ సోషల్ మీడియా పోస్ట్ లో ఈ కింగ్ క్రాబ్ అరుదైన జీవి మాత్రమే కాదు దీని ఉనికి తెలియడం పార్క్ పర్యావరణ వ్యవస్థ బలానికి ఒక ముఖ్యమైన సంకేతం కూడా. ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇప్పుడు దాని అద్భుతమైన జీవవైవిధ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ రక్షిత వన్యప్రాణుల ఉనికి అడవి అద్భుతమైన వాతావరణానికి నిదర్శనమని చెప్పారు.

ఇవి కూడా చదవండి

సిరింధోర్న్ క్రాబ్ అని కూడా పిలువబడే కింగ్ క్రాబ్ కు థాయిలాండ్ యువరాణి మహా చక్రి సిరింధోర్న్ పేరు పెట్టారు. ఆసక్తికరంగా ఈ జాతి పాండా కుటుంబానికి చెందినది. పాండా పీతలు సాధారణంగా వాటి తెలుపు, నలుపు రంగుతో ప్రసిద్ధి చెందాయి. అయితే ఊదా రంగు పీత వెర్షన్ చాలా అరుదు. పాండా పీతల గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. ఇక వీటిలోని ఊదా రంగు పీత గురించి అయితే ప్రజలకు చాలా తక్కువగా తెలుసు.

నేషనల్ జియోగ్రాఫిక్ 2012 నివేదిక ప్రకారం జర్మనీలోని సెంకెన్‌బర్గ్ మ్యూజియం ఆఫ్ జువాలజీ శాస్త్రవేత్త హెండ్రిక్ ఫ్రీటాగ్ ఈ అధ్యయనంలో ఈ పీత ఊదా రంగు ‘యాదృచ్ఛికంగా’ ఉద్భవించి ఉండవచ్చని అన్నారు. ఈ పీతకు ప్రత్యేక ఊదా రంగు ఏదైనా నిర్దిష్ట కారణంగా లేదా ఫంక్షన్ కోసం ఉద్భవించి ఉండకపోవచ్చని చెప్పారు.

ఈ ప్రత్యేకమైన, అందమైన దృశ్యం ఇంటర్నెట్‌లో ఉత్సుకతని, ఆశ్చర్యం రెండింటినీ సృష్టించింది. ప్రజలు దాని రంగుకు ఆకర్షితులవడమే కాదు దీని రంగు అరుదుగా ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రకృతిలో ఇటువంటి జీవుల మనుగడ జీవవైవిధ్యాన్ని రక్షించడానికి , సంరక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఎంత ముఖ్యమో మనకు గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రయత్నాలు ఈ అద్భుతమైన జీవులను, వాటి ఆవాసాలు సురక్షితంగా ఉండి భవిష్యత్ తరాలకు అందజేయవచ్చు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..