Viral News: అంగారకుడి ఉపరితలం కింద ఆవులు దాగి ఉండవచ్చు! శాస్త్రవేత్త సంచలన ప్రకటన
మార్స్ ఉపరితలం క్రింద మీథేన్ వాయువు మూలం ఏమిటనేది తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చని భావిస్తున్నారు. ఇది జీవవుల ఉనికికి సంబంధించినది అని భావిస్తున్నారు. అంగారక గ్రహంపై జీవరాశులు ఉండే అవకాశాన్ని సూచిస్తుందని అంటున్నారు. ఇటీవల ఒక శాస్త్రీయ చర్చలో ఒక విచిత్రమైన వాదన వెలుగులోకి వచ్చింది.
అంగారక గ్రహంపై జీవుల కోసం అన్వేషణ ఎప్పటి నుంచో శాస్త్రజ్ఞులు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలకు ముఖ్యమైన, ఉత్తేజకరమైన విషయం ఒకటి తెలిసినట్లు వైరల్ అవుతోంది. మార్స్ ఉపరితలంపై పరిస్థితులు చాలా కఠినమైనవిగా ఉన్నా మానవులు జీవించేందుకు అవి అననుకూలమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఇందులో బలహీన వాతావరణం, అతి శీతల ఉష్ణోగ్రతలు, రేడియేషన్ ఉన్నాయి. అయితే ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఈ గ్రహ ఉపరితలం క్రింద జీవులు నివసిస్తున్న సంకేతాలు ఉండవచ్చని భావిస్తున్నారు. చాలా మంది నిపుణులు అంగారకుడిపై గతంలో జీవులు ఉండేవని నమ్ముతారు.
మార్స్ ఉపరితలం క్రింద మీథేన్ వాయువు మూలం ఏమిటనేది తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చని భావిస్తున్నారు. ఇది జీవవుల ఉనికికి సంబంధించినది అని భావిస్తున్నారు. అంగారక గ్రహంపై జీవరాశులు ఉండే అవకాశాన్ని సూచిస్తుందని అంటున్నారు. ఇటీవల ఒక శాస్త్రీయ చర్చలో ఒక విచిత్రమైన వాదన వెలుగులోకి వచ్చింది. అందులో అంగారకుడి ఉపరితలం క్రింద మీథేన్ వాయువు ఉనికికి భూగర్భంలో ఉన్న చిన్న ఆవులు కారణం కావచ్చు అని చెప్పబడింది. ఎందుకంటే భూమిపై మీథేన్ వాయువును విడుదల చేయడంలో పశువులకు ముఖ్యంగా ఆవులు కారణం అని నిరూపించబడింది.
డైలీ స్టార్ నివేదిక ప్రకారం మార్స్‌పై మీథేన్ సమస్య గురించి కార్నెల్ విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్త లిసా కల్టెనెగర్ , ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ ఖగోళ భౌతికశాస్త్ర ప్రొఫెసర్ క్రిస్ లింటోట్ మధ్య చర్చ జరిగింది. ఈ సమయంలో మార్స్‌పై క్యూరియాసిటీ రోవర్ ద్వారా మీథేన్ వాయువు ఉన్నట్లు కనుగొనబడిందని.. ఈ వాయువు బహుశా అంగారక గ్రహం ఉపరితలం క్రింద నుండి వస్తోందని లింటోట్ చెప్పారు.
మీథేన్ భూగర్భ ఆవుల నుంచి వచ్చిందా అని కాల్టెనెగర్ అడిగినప్పుడు.. మార్స్ ఉపరితలం క్రింద దాక్కుని ‘చిన్న ఆవులు’ ఉండవచ్చని లింటోట్ బదులిచ్చారు. అయితే ఈ విషయం విన్న లింటోట్.. ఫన్నీగా తీసుకున్నారు. హాస్యాస్పదంగా కామెంట్ చేశారు.
భౌగోళిక ప్రక్రియలు, వేడి లేదా రసాయన ప్రతిచర్యలు వంటి కారకాల వలన మీథేన్ తో పాటు ఇతర సంభావ్య మూలాలు కూడా ఉండవచ్చని లింటోట్ అంగీకరించాడు. అంగారకుడిపై జీవులున్నట్లు నిర్ధారించడానికి మరింత ఖచ్చితమైన పరిశోధన అవసరమని చెప్పారు. శాస్త్రీయ పరిశోధనలు ఎల్లప్పుడూ బలమైన ఆధారాలు, వాస్తవాలపై ఆధారపడి ఉంటాయి అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..