వామ్మో.. పట్టపగలు రద్దీగా ఉండే రోడ్డుపై కింగ్ కోబ్రా హల్‌చల్..! వీడియో చూశారంటే గుండె గుబేల్..
పట్టపగలు, రోడ్డుపై జనాలు ఎక్కువగా తిరుగుతున్న సమయంలో పాము ఆటోకు వేలాడుతూ కనిపించింది.. ఈ దృశ్యం చూసి పాదచారులు షాక్‌కు గురయ్యారు. వీడియో విడుదలైన వెంటనే వైరల్‌గా మారింది. వీడియోలో, పాము ఆటో వెనుక నుండి పైకి లేచింది. కాస్త లేచి పడగ విప్పింది.. ఆటో వెనుక వైపు నుంచి నిలువునా లేచిన పాము ఆటోలోకి దూరేందుకు ప్రయత్నిస్తుంది. పాము చుట్టూ పాదచారులు గుమిగూడుతున్నారు.
ముంబై వీధుల్లో పాముల బెడద పెరుగుతోంది. కొన్నిసార్లు వారు కిటికీలకు లేదా నీటి పైపులకు వేలాడుతూ కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు పాములు ఎత్తైన భవనాల్లోకి కూడా ప్రవేశిస్తున్నాయి. రెండు, మూడు అంతస్తుల మీద వరకు పాకుతూ వెళ్లిపోతున్నాయి. విండో ద్వారా ఫ్లాట్ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటాయి. కొన్నిసార్లు పాములు బిజీగా ఉన్న వీధులు, రద్దీ ఎక్కువగా ఉన్న రహాదారుల మధ్యలో కూడా కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. కానీ ఈసారి పాము తన స్టైల్ మార్చుకున్నట్టుగా ఉంది..పాకుతూ, పరిగెడుతూ వెల్లటం ఎందుకు శ్రమ దండగా అనుకుందేమో ఏమో గానీ, ఒక పాము..హాయిగా ఆటోలో వెళ్లాలనుకున్నట్టుగా ఉంది..? అదేంటో పాము ఆటోలో ప్రయాణించటం అనుకుని ఆశ్చర్యంగా భావిస్తున్నారా? అయితే వాణిజ్య నగర వీధుల్లో అలాంటి దృశ్యమే కనిపించింది. పట్టపగలు రద్దీగా ఎక్కువగా ఉండే రోడ్డు మధ్యలో కింగ్ కోబ్రా కనిపించి స్థానికుల్ని హడలెత్తించింది.
తాజాగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కింగ్ కోబ్రా ముంబై వీధుల్లో తిరుగుతుంది. పట్టపగలు, రోడ్డుపై జనాలు ఎక్కువగా తిరుగుతున్న సమయంలో పాము ఆటోకు వేలాడుతూ కనిపించింది.. ఈ దృశ్యం చూసి పాదచారులు షాక్‌కు గురయ్యారు. వీడియో విడుదలైన వెంటనే వైరల్‌గా మారింది. వీడియోలో, పాము ఆటో వెనుక నుండి పైకి లేచింది. కాస్త లేచి పడగ విప్పింది.. ఆటో వెనుక వైపు నుంచి నిలువునా లేచిన పాము ఆటోలోకి దూరేందుకు ప్రయత్నిస్తుంది. పాము చుట్టూ పాదచారులు గుమిగూడుతున్నారు.
Near Ticket window of Badlapur railway station#wildearth #AnimalLovers #badlapur #snake pic.twitter.com/5echRbAA3A
— ABHI KUSHWAHA (@ABHIKUS44168075) October 12, 2023
అభి కుష్వాహ అనే యూజర్ ద్వారా X హ్యాండిల్ (గతంలో ట్విట్టర్)లో వీడియో షేర్ చేయబడింది. ఈ సంఘటన బద్లాపూర్ ప్రాంతంలో జరిగిందని కూడా రాశాడు. ఈ ఆటోలను బద్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని టికెట్ కౌంటర్ దగ్గర నిలిపారు. ఈ పాము ఆ ఆటోల్లో ఒకదానిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..