Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పగోడికి కూడా ఈ బాధ ఉండకూడదు.. ఈ లవ్ ఫెయిల్యూర్ వ్యక్తీ ఏం చేశాడో చూస్తే..!

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఒక ప్రత్యేకమైన వివాహం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ప్రేమలో పదే పదే మోసపోవడాన్ని తట్టుకోలేకే ఒక వ్యక్తి మేకను పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహనికి సంబంధించిన వార్తల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ పోస్ట్‌పై నెటిజన్లు చాలా సరదాగా కామెంట్ చేస్తున్నారు.

పగోడికి కూడా ఈ బాధ ఉండకూడదు.. ఈ లవ్ ఫెయిల్యూర్ వ్యక్తీ ఏం చేశాడో చూస్తే..!
Man Married Goat
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 31, 2025 | 12:50 PM

‘ప్రేమ గుడ్డిది’ అనే ఈ సామెతను మీరు వినే ఉంటారు. అంటే, ప్రేమకు పరిమితులు లేవు. కులం లేదా మతం లేదు, ఎవరైనా ఏ వయసులోనైనా ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చు. కానీ అతను మేకను పెళ్లి చేసుకునేంత గుడ్డివాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఒక ప్రత్యేకమైన వివాహం గురించి చాలా చర్చ జరుగుతోంది. దీని గురించి తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

అనేక విఫల సంబంధాలను ఎదుర్కొన్న తర్వాత భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి మేకను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని ఒక వింత కథనం వెలుగులోకి వచ్చింది. ఈ వింత కథ సోషల్ మీడియాలో లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది. కానీ దాని ప్రామాణికతను నిర్ధారించడానికి విశ్వసనీయమైన ఆధారాలు చాలా తక్కువ.

ఈ వివాహం హిందూ ఆచారాల ప్రకారం జరిగిందని, ఆ వ్యక్తి మేక డిమాండ్‌ను తీర్చడం ద్వారా మేకను తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడని అందులో పేర్కొన్నారు. వైరల్ పోస్ట్ ప్రకారం, ఆ మనిషి మేకతో తనకు కలిగిన సాన్నిహిత్యం ఏ మానవుడితోనూ లభించదని వెల్లడించాడు. ఆ కథనం ప్రకారం, ప్రేమలో పదే పదే జరిగిన ద్రోహాల వల్ల ఆ వ్యక్తి గుండె పగిలిపోయాడు. దీని తరువాత అతను ఇకపై ఏ మనిషినీ వివాహం చేసుకోనని నిర్ణయించుకున్నాడు. అందుకే తన నిర్ణయంలో దృఢంగా ఉండి, ఒక మేకను వివాహం చేసుకున్నాడు.

ఈ ప్రత్యేకమైన సంఘటన సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వీక్షణలు, లైక్‌లను సంపాదించింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో @famous.pulse అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 3 లక్షలకు పైగా లైక్ చేశారు. అయితే ఇది ఫన్నీ వ్యాఖ్యలతో నిండిపోయింది. కొంతమంది ఇంటర్నెట్ వినియోగదారులు ఆ వ్యక్తి పట్ల సానుభూతి వ్యక్తం చేయగా, మరికొందరు దానిని ఎగతాళి చేశారు. కొంతమంది సరదాగా, “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటున్నారు. ఒక యూజర్ సరదాగా వ్యాఖ్యానించాడు, ఒక రోజు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, వారిద్దరూ గొడవ పడ్డారు, ఆపై మటన్ బిర్యానీ తయారు చేశారు. మరొక వినియోగదారుడు, మీకు ప్రేమ కాదు, చికిత్స అవసరం అని అన్నారు. అలాంటి వ్యక్తులు ఎక్కడి నుండి వస్తారని మరొక వినియోగదారు రాశారు.

ఇది మొదటి సంఘటన కాదు. గతంలో ఇండోనేషియాలో సైఫ్ ఆరిఫ్ అనే 44 ఏళ్ల వ్యక్తి మేకను వివాహం చేసుకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. అదేవిధంగా, పాకిస్తాన్‌లోని సింధ్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. భిల్ కమ్యూనిటీకి చెందిన ఒక యువకుడు మేకను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా మరో ఘటన వెలుగులోకి రావడం షాక్ అవుతున్నారు నెటిజన్లు.

గమనిక: ఈ ప్రత్యేకమైన వివాహాన్ని TV9 నిర్ధారించలేదు. ఈ వార్త ఒక వైరల్ పోస్ట్ ఆధారంగా రూపొందించింది.. దీనిపై నెటిజన్లు విభిన్నమైన స్పందనలు ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..