Viral News: క్యాన్సర్‌తో భర్త రెండేళ్ళ క్రితం మృతి.. అతని బిడ్డకు జన్మనిచ్చిన భార్య… సినిమా స్టోరీని తలపించే ప్రేమ ఈ జంట సొంతం
నేటి ఆధునిక యుగంలో మనిషి తన మేథస్సుతో సృష్టికి ప్రతి సృష్టి చేసే విధంగా పయనిస్తున్నాడు. సైన్స్ అనేక అద్భుతమైన విజయాలను సాధించింది. ఒకొక్కసారి కొన్ని సంఘటనలను గురించి వింటే ఇది సైన్స్ సాధించిన విజయమా.. అద్భుతమా.. లేక మరేదైనానాఅనిపించకమానవు ఎవరికైనా.. అలాంటి ఓ అద్భుతానికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట్లో చర్యలో నిలిచింది. ఒక స్త్రీ తన భర్త మరణించిన తర్వాత అది కూడా రెండేళ్ళ తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు.

ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని ప్రారంభించగలిగే మంచి జీవిత భాగస్వామి కావాలని కలలు కంటుంది. అయితే.. కొన్నిసార్లు జీవితం ఎవరూ ఊహించని మలుపులు తిరుగుతుంది. కొన్ని అద్భుతాలు వింటే ఇది సినిమానా అనిపిస్తాయి. అలాంటి కథ 34 ఏళ్ల షార్లెట్ కి సంబంధించినది. ఆమె తనకు మంచి భర్త రావాలని.. మంచి కుటుంబం ఏర్పడాలని అనేక కలలు కన్నది. అయితే ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అయితే.. షార్లెట్ జీవితంలో తరువాత కూడా ఒక అద్భుతం జరిగింది.
షార్లెట్ తన నవజాత కొడుకును చేతులలో పట్టుకుని.. తన కొడుకు ఎలిజా తన ప్రేమకి.. తన భర్త సామ్ కి ప్రతిరూపం అని భావిస్తుంది. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే.. ఆ బిడ్డ తన తండ్రిని చూడాలనుకున్నా జీవితంలో ఎప్పటికీ చూడలేడు ఎందుకంటే అతని తండ్రి శిశివు పుట్టడానికి రెండు సంవత్సరాల ముందు మరణించాడు. 34 ఏళ్ల షార్లెట్ కల ఏమిటంటే.. తను, తన భర్త సామ్ కలిసి జీవించాలని.. అందమైన ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంది. దీంతో వీరిద్దరూ జనవరి 2021లో బీచ్‌లో వివాహం చేసుకున్నారు.
ఇదంతా ఎలా జరిగింది? దీని తరువాత 2022 సంవత్సరంలో షార్లెట్ తన భర్తకు క్యాన్సర్ ఉందని తెలుసుకుంది. సామ్ వయసు కేవలం 31 సంవత్సరాలు. అప్పటికే క్యాన్సర్ అనేక అవయవాలకు వేగంగా వ్యాపించింది. చికిత్స కూడా తనని కాపాడలేదు అని తెలుసుకున్నాడు. సామ్ క్యాన్సర్ కి చికిత్స తీసుకోవడం ప్రారంభించినప్పుడు.. చికిత్స తన సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందని దృష్టిలో ఉంచుకుని అతను తన వీర్యాన్ని స్తంభింపజేసాడు. వ్యాధి ఉన్నప్పటికీ.. అతను, షార్లెట్ భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుకున్నారు. వీరిద్దరూ కలిసి పిల్లల పేర్ల గురించి కూడా ఆలోచించారు. అయితే 2022 ఏప్రిల్ నెలలో సామ్ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు.
తన భర్త మరణించిన తర్వాత కూడా.. షార్లెట్ సామ్ కలను నెరవేర్చాలని అనుకుంది. ఆమె ఆస్ట్రేలియా వెళ్లి IVF ప్రక్రియను ప్రారంభించింది. మొదటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ మూడవసారి అదృష్టం ఆమెవైపే ఉంది. ఏప్రిల్ 2023లో ఆమె గర్భవతి అయింది. తాను గర్భవతి అని నర్స్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానని చెప్పింది. సామ్ తనని విదిచి వెళ్ళిన తర్వాత నేను మొదటిసారి సంతోషంగా ఉన్నాను. అయితే.. ఈ ప్రయాణం అంత సులభం కాదు. గర్భధారణ సమయంలో తాను చాలా ఒంటరిగా ఉన్నానని షార్లెట్ చెప్పింది. ఎందుకంటే అలాంటి సమయాల్లో ప్రతి భార్యకు తన జీవిత భాగస్వామి అత్యంత అవసరమని భావిస్తుంది. అయితే తనకు ఎప్పుడూ ఆ అదృష్టం దొరకదని తెలిసి.. తన చుట్టూ సామ్ ఉన్నట్లు భావించింది.
ఆ పిల్లవాడికి తన తండ్రి గురించి తెలుసు షార్లెట్ తన కొడుకు పుట్టే సమయంలో.. సామ్ తండ్రి తనకు పూర్తిగా మద్దతుగా నిలిచాడని చెప్పింది. అంతేకాదు నేను ఇంట్లో ఎలిజాకు జన్మనిచ్చె సమయంలో గదిలో సామ్ ఫోటోలు ఉన్నాయి. అతను ఇక్కడే ఉండి తనకు ధైర్యం ఇస్తున్నట్లు అనిపించిందని పేర్కొంది. ఎలిజాకు ఇప్పుడు ఒక సంవత్సరం వయస్సు . నెమ్మదిగా ఎలిజాకి తండ్రితో అనుబంధం ఏర్పడటం మొదలైంది. షార్లెట్ సామ్ గొంతును రికార్డ్ చేసింది. ఆమె దానిని తన కొడుకుకు వినిపిస్తూనే ఉంటుంది. చిత్రంలో సామ్‌ను చూసినప్పుడల్లా.. నాన్న అని పిలుస్తాడు. ఈ క్షణాలు షార్లెట్‌కు చాలా ప్రత్యేకమైనవి ఎందుకంటే సామ్ తన కొడుకు ద్వారా ఇప్పటికీ తనతోనే ఉన్నాడని ఆమె భావిస్తుంది.
ఈ రోజు షార్లెట్ తన బిడ్డతో తన జీవితాన్ని ఆస్వాదిస్తోంది. తన కొడుకును పెంచుతున్నప్పుడు..తన భర్త కల నెరవేరిందని ఆమె భావిస్తుంది. ప్రస్తుతం సామ్, షార్లెట్ ప్రేమకథ ఒక సినిమా కథ కంటే తక్కువ కాదని షార్లెట్ ప్రేమ నిజమైన ప్రేమ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




