AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ట్రైన్‌లో ఎన్ని రిజర్వేషన్ సీట్లు ఉంటాయో తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఎక్కువ దూరం వెళ్లాల్సి ఉన్నప్పుడు.. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలంటే ఏకైక మార్గం రైలు ప్రయాణం. అందుకే రైళ్లకు ఫుల్ డిమాండ్. ఇక పండగలు వచ్చాయంటే ఆ రద్దీ మమూలుగా ఉండదు. నెలల ముందు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక ట్రైన్‌లో ఎన్ని రిజర్వేషన్ సీట్లు ఉంటాయో తెలుసా..?

Indian Railways: ట్రైన్‌లో ఎన్ని రిజర్వేషన్ సీట్లు ఉంటాయో తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..
How Many Reservation Seats In A Train
Krishna S
|

Updated on: Aug 28, 2025 | 11:26 AM

Share

దేశంలో రైలు ఎక్కని వారు చాలా తక్కువ. దేశంలో ఎక్కడికి వెళ్లాలన్న చాలా మంది మొదటి ఆప్షన్ ట్రైన్. రోజూ కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తారు. దేశంలో ఎక్కడికి వెళ్లడానికైనా ట్రైన్స్ అందుబాటులో ఉండడంతో పాటు ధరలు తక్కువగా ఉండడమే రద్దీకి కారణం. ఇక పండుగలు వచ్చాయంటే నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కోట్లాది మంది ప్రయాణించే ఈ రైళ్లలో మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయి? వాటిలో రిజర్వేషన్ కోసం ఎన్ని కేటాయిస్తారనేది చాలా మందికి తెలియని విషయం.

ప్రతిరోజు భారతీయ రైల్వే దాదాపు 2.3 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఇంత భారీ సంఖ్యలో ప్రయాణికులకు సీట్లు కేటాయించాలంటే, రైల్వే ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరించాలి. ఇందుకోసం రైల్వే ప్రతి బెర్త్, ప్రతి కోటా, ప్రతి సౌకర్యాన్ని ముందుగానే విభజిస్తుంది. సాధారణంగా ఒక రైలులో 1,000 నుండి 1,100 వరకు రిజర్వేషన్ సీట్లు ఉంటాయి. కోచ్‌ల సంఖ్య ఎక్కువగా ఉన్న రైళ్లలో ఈ సంఖ్య 1500 నుంచి 2000 వరకు పెరగవచ్చు. రిజర్వేషన్ ఉన్న కోచ్‌లలో ఏసీ, స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. అయితే జనరల్ కోచ్‌లలో మాత్రం టికెట్ ఉన్న ఏ ప్రయాణికైనా ప్రవేశం ఉంటుంది. ప్రతి కోచ్‌లో సీట్ల సంఖ్య వేరువేరుగా ఉంటుంది.

సీట్ల క్రమం ఇలా..

ఒక రైల్లో 2 ఫస్ట్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, 4 థర్డ్ ఏసీ, 6 స్లీపర్, 2 చైర్ కార్ కోచ్‌లు ఉంటే.. ఫస్ట్ ఏసీలో.. ఒక్కో కోచ్‌లో 24 బెర్త్‌లు చొప్పున రెండు కోచ్‌లలో కలిపి 48 సీట్లు ఉంటాయి. సెకండ్ ఏసీ.. ఒక్కో కోచ్‌లో దాదాపు 54 బెర్త్‌లు చొప్పున, రెండు కోచ్‌లలో కలిపి 108 సీట్లు ఉంటాయి. థర్డ్ ఏసీ.. ఒక్కో కోచ్‌లో 72 బెర్త్‌లు చొప్పున, నాలుగు కోచ్‌లలో కలిపి 288 సీట్లు ఉంటాయి. అదేవిధంగా స్లీపర్ కోచ్.. ఒక్కో కోచ్‌లో 72 బెర్త్‌లు చొప్పున.. ఆరు కోచ్‌లలో కలిపి 432 సీట్లు అందుబాటులో ఉంటాయి.

PNR – వెయిటింగ్ లిస్ట్ రూల్స్

ఒక ప్యాసింజర్ నేమ్ రికార్డ్ ద్వారా గరిష్టంగా ఆరుగురికి టికెట్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే కొత్త నిబంధనల ప్రకారం.. స్లీపర్ కోచ్‌లో 72 బెర్త్‌లు ఉంటే.. గరిష్టంగా 18 వెయిటింగ్ లిస్ట్ టికెట్లు మాత్రమే జారీ చేస్తారు. ఈ నిబంధనల వల్ల టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. ఒకరి సీటు కన్ఫర్మ్ అయి, మిగతా వారివి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నప్పటికీ అందరూ కలిసి ప్రయాణించవచ్చు.

లక్షలాది మంది ప్రయాణికులు రోజూ రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తారు. అందుకే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడం ద్వారా, సరైన కోటాను ఎంచుకోవడం ద్వారా ప్రయాణం సులభంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగుతుందని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..