మహిళల కోసం ‘టిక్‌టాక్‌’లోకి పోలీసులు.. ఐడియా సూపర్ గురూ

ప్రస్తుతం సోషల్ మీడియాతో తెగ ట్రెండ్ అవుతున్న యాప్‌లలో టిక్‌టాక్ ఒకటి. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలామంది ఈ యాప్‌‌ పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. అందులో కొందరు తమ టాలెంట్‌ను చూపిస్తుంటే.. మరికొందరు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆ యాప్‌ను వాడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ టిక్‌టాక్ క్రేజ్‌ను వాడుకున్న కేరళ పోలీసులు ఇటీవల ఈ మాధ్యమంలోకి ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా ఉత్తరాఖండ్ పోలీసులు ఆ లిస్ట్‌లో చేరిపోయారు. టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారు అందులో మహిళలకు […]

మహిళల కోసం ‘టిక్‌టాక్‌’లోకి పోలీసులు.. ఐడియా సూపర్ గురూ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 17, 2019 | 7:49 PM

ప్రస్తుతం సోషల్ మీడియాతో తెగ ట్రెండ్ అవుతున్న యాప్‌లలో టిక్‌టాక్ ఒకటి. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలామంది ఈ యాప్‌‌ పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. అందులో కొందరు తమ టాలెంట్‌ను చూపిస్తుంటే.. మరికొందరు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆ యాప్‌ను వాడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ టిక్‌టాక్ క్రేజ్‌ను వాడుకున్న కేరళ పోలీసులు ఇటీవల ఈ మాధ్యమంలోకి ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా ఉత్తరాఖండ్ పోలీసులు ఆ లిస్ట్‌లో చేరిపోయారు. టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారు అందులో మహిళలకు ఆత్మరక్షణ మెళుకువలకు సంబంధించిన వీడియోలను పెడుతున్నారు. రోడ్డు భద్రత, సెల్ఫ్ ఢిపెన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఇప్పటికే లక్ష లైక్‌లను తెచ్చుకున్న వారు.. మరిన్ని సరికొత్త వీడియోలను అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారు.

ఇక ఈ విషయంపై ఉత్తరాఖండ్ డీజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు త్వరగా.. మరింత చేరువకావడానికి టిక్‌టాక్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం. రోడ్డు భద్రత, సైబర్ సెక్యూరిటీ, మహిళా రక్షణకు సంబంధించిన వీడియోలను అందులో షేర్ చేస్తున్నాం. వీటికి మంచి స్పందన వస్తోంది అని అన్నారు. కాగా ఈ వీడియోలకు నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి కోసం పోలీసులు చేస్తున్న ఈ ప్రయోగం అద్భుతం అంటూ కామెంట్లు పెడుతున్నారు.