AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్వీట్స్ షాపు సీలింగ్ నుంచి వింత శబ్ధాలు.. పైకి చూసిన సిబ్బంది గుండె ఆగినంత పని..!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలోని ఓ మిఠాయి దుకాణంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుకాణం సీలింగ్ కింద సుమారు 8 అడుగుల పొడవున్న కొండచిలువ దాక్కుని ఉండటాన్ని గమనించిన ఉద్యోగులు, కస్టమర్లు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: స్వీట్స్ షాపు సీలింగ్ నుంచి వింత శబ్ధాలు.. పైకి చూసిన సిబ్బంది గుండె ఆగినంత పని..!
Python In Sweet Shop
Balaraju Goud
|

Updated on: Jul 25, 2026 | 1:36 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలోని ఓ మిఠాయి దుకాణంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుకాణం సీలింగ్ కింద సుమారు 8 అడుగుల పొడవున్న కొండచిలువ దాక్కుని ఉండటాన్ని గమనించిన ఉద్యోగులు, కస్టమర్లు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీరట్‌లోని శివ్ చౌక్ ప్రాంతంలోని ఓ స్వీట్స్ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. సీలింగ్ సమీపంలో భారీ కొండచిలువ కనిపించడంతో దుకాణంలో ఉన్నవారు వెంటనే బయటకు పరుగులు తీశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించింది.

వీడియోలో ఇద్దరు యువకులు జాగ్రత్తగా పైకప్పు వద్దకు చేరుకుని కొండచిలువను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. దానిని కిందకు దించే క్రమంలో కొండచిలువ తన భారీ శరీరాన్ని చాచి వారి చుట్టూ చుట్టుకునే ప్రయత్నం చేయడంతో అక్కడున్నవారిలో మరింత భయం నెలకొంది. చుట్టుపక్కల ఉన్న వారి అరుపులు, ఆందోళన వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ రెస్క్యూ సిబ్బంది ఏమాత్రం బెదరకుండా ఓపికగా వ్యవహరిస్తూ కొండచిలువను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం అటవీ శాఖ బృందం కొండచిలువను సురక్షితంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టింది. దీంతో దుకాణ యజమానులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అంత పెద్ద కొండచిలువను దుకాణంలో చూడటం నిజంగా భయానకమని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, రెస్క్యూ సిబ్బంది చూపిన ధైర్యం, సమయస్ఫూర్తిని మరికొందరు ప్రశంసించారు. వర్షాకాలంలో పాములు, కొండచిలువలు నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో వాటిని పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us