Video: నల్ల కోటు లేకుండా జడ్జి సీట్‌లో మహిళ..! అసలు మ్యాటర్ తెలిస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు
వారణాసి జిల్లా కోర్టులో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. జడ్జి సెలవులో ఉండగా, 50 ఏళ్ల వందనా గుప్తా అనే మహిళ నేరుగా జడ్జి కుర్చీలో కూర్చుని "ఆర్డర్... ఆర్డర్" అంటూ విచారణలు ప్రారంభించమని ఆదేశించింది. లాయర్లు షాక్ అయ్యారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించారు.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా కోర్టులో శుక్రవారం ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. జిల్లా జడ్జి సెలవులో ఉండటంతో కోర్టు హాలులోకి ప్రవేశించిన వందనా గుప్తా (50) అనే మహిళ నేరుగా జడ్జి కుర్చీలో కూర్చొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యే సమయంలో ఆమె జడ్జి సీటులో కూర్చోని, అక్కడ ఉన్న గావెల్ (చెక్క సుత్తి)ను కొడుతూ “ఆర్డర్… ఆర్డర్… విచారణలు ప్రారంభించండి” అంటూ కోర్టు రూమ్‌లోకి అప్పుడే వస్తున్న లాయర్లను ఆదేశించింది. అది చూసి లాయర్లు కంగారు పడ్డారు. ఈ కొత్త న్యాయమూర్తి ఎవరబ్బా అంటూ షాక్ అయ్యారు.
అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించిన అధికారులు, ఆమె నుంచి ఎటువంటి ప్రమాదకర చర్యలు జరగలేదని నిర్ధారించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి వారికి అప్పగించారు. ఈ ఘటన కొద్దిసేపు కోర్టు ప్రాంగణంలో కలకలం రేపగా, అక్కడ ఉన్న న్యాయవాదులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో పరిస్థితి త్వరగానే సాధారణ స్థితికి చేరుకుంది. ఈ అసాధారణ సంఘటనకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారాయి.
వీడియో చూడండి
on Friday in the Varanasi district court A woman named Vandana Gupta (50), who came into the courtroom early in the morning, went straight to the judge’s chair and sat down. After the police investigation revealed that she was mentally unwell, she was handed over to her family pic.twitter.com/gi4jg7FjqU
— Sayyad Nag Pasha (@nag_pasha) June 14, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
