వార్నీ.. ఇదెక్కడి పైత్యంరా బాబు.. పాండాలకు పేరు పెట్టేందుకు రూ.76లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం..!
అయితే, ఇటీవల రెండు పాండాలకు పేరు పెట్టేందుకు గానూ ప్రభుత్వం ఏకంగా రూ.76 లక్షలు వెచ్చించి పోటీలు నిర్వహించారు. అయినప్పటికీ వాటిని పాత పేర్లతోనే పిలుస్తున్నారు. దాంతో ఖర్చంతా వృధానే అయింది.. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే...
పాండా.. అత్యంత అరుదైన, అందమైన జంతువు. దీని పుట్టిల్లు చైనా. వీటిని జాతీయ సంపదగా భావిస్తుంది డ్రాగన్ కంట్రీ. ఇతర దేశాలతో సత్సంబంధాలను కొనసాగించేందుకు, అంతర్జాతీయంగా తమ ప్రతిష్ఠను మరింత బలోపేతం చేసుకోవడం కోసం విదేశాలకు పాండాలను బహూకరించే ఆనవాయితీ కూడా చైనాకు ఉంది. అయితే, ఇటీవల రెండు పాండాలకు పేరు పెట్టేందుకు గానూ హాంకాంగ్ ప్రభుత్వం ఏకంగా రూ.76 లక్షలు వెచ్చించి పోటీలు నిర్వహించారు. అయినప్పటికీ వాటిని పాత పేర్లతోనే పిలుస్తున్నారు. దాంతో ఖర్చంతా వృధానే అయింది.. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే…
ఈ ఏడాది ప్రారంభంలో హాంకాంగ్ అధికారులకు చైనా రెండు పెద్ద పాండాలను బహుమతిగా ఇచ్చింది. వాటి పేరు మార్చడానికి ఒక పోటీ నిర్వహించబడింది. దీని కోసం రూ. 76 లక్షలు ($ 90,028) ఖర్చు చేశారు. అయితే ఇంత భారీ మొత్తం ఖర్చు చేసినా అసలు పేరు మాత్రం అలాగే ఉంచారు.
ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో వెల్లడైన నివేదిక మేరకు.. అక్టోబరు నెలలో ఒక పెద్ద పాండాకు పేరు మార్చే పోటీని ప్రారంభించారు. అక్కడ సిచువాన్‌కు చెందిన రెండు పాండాలు ‘యాన్ ఆన్’, ‘కే కే’ కోసం కొత్త పేర్లను సూచించడానికి ప్రజలను ఆహ్వానించారు. ఈ కార్యకలాపాల కోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను తయారు చేశారు. సిబ్బందిని నియమించుకోవడం, ఇంటర్నెట్‌లో, హాంకాంగ్‌లోని మాస్ ట్రాన్సిట్ రైల్వే (MTR) స్టేషన్‌లలో ప్రకటనలు పోస్ట్ చేయడం, అలాగే విజేతలకు బహుమతులు అందించడం కోసం ఈ డబ్బు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఈ పోటీలో విజేతకు రూ.5.16 లక్షలు బహుమతిగా అందజేశారు. ఇందులో టూర్‌బిల్లాన్ వాచ్, ఓషన్ పార్క్ సభ్యత్వం, రూ.4 లక్షల విలువైన వోచర్లు ఉన్నాయి.
ఇక్కడే అసలైన ట్విస్ట్ నెలకొంది. అవార్డు ప్రకటించినప్పటికీ, పాండాల అసలు పేర్లను అలాగే ఉంచుతామని న్యాయనిర్ణేతలు ప్రకటించారు. డబ్బు వృధా గురించి ప్రశ్నించగా, సంస్కృతి, క్రీడలు, పర్యాటక శాఖ కార్యదర్శి రోసన్నా లా షుక్-పుయ్ మాట్లాడుతూ, ప్రజలు అసలు పేరును ఉంచడానికి ఇష్టపడతారని అధికారులు గ్రహించలేదని అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..