UK man Sperm Donor: నేను 129 మంది పిల్లలకు తండ్రి అయ్యా.. 150 మంది పిల్లలకు తండ్రి కావడమే ధ్యేయమంటున్న ఓ వ్యక్తి..

UK man Sperm Donor:నేటి సమాజంలో ఒక బిడ్ద ఉంటేనే వారిని పెంచడానికి తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నాం.. రెండో బిడ్డ వద్దు అని అంటున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇప్పటికే నేను 129 పిల్లలకు..

UK man Sperm Donor: నేను 129 మంది పిల్లలకు తండ్రి అయ్యా.. 150 మంది పిల్లలకు తండ్రి కావడమే ధ్యేయమంటున్న ఓ వ్యక్తి..
World's Most Prolific Sperm Donor
Follow us

|

Updated on: Jan 28, 2022 | 2:08 PM

UK man Sperm Donor:నేటి సమాజంలో ఒక బిడ్ద ఉంటేనే వారిని పెంచడానికి తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నాం.. రెండో బిడ్డ వద్దు అని అంటున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇప్పటికే నేను 129 పిల్లలకు తండ్రి అయ్యా.. 150 మంది పిల్లలకు తండ్రి కావడం నా ధ్యేయం అంటున్నాడు 66 ఏళ్ల ఓ వ్యక్తి. అదేంటి నలుగురు, ఐదుగురు కాదు.. ఏకంగా వందమందికి పైగా తండ్రి కావడం ఎలా సాధ్యమైంది అని అనుకుంటున్నారా.. ఆ వ్యక్తి వీర్యం దానం(sperm donor) చేసి.. అంతమంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అవును చాలా దేశాల్లో వీర్యదానం చేయడం తప్పుకాదు.. అక్కడ వీర్య దానంపై ఎటువంటి నియమ నిబంధనలు లేవు.. చట్టాలు కూడా అనుమతిస్తాయి. మరి 129 పిల్లల తండ్రి ఏ దేశంలో ఉన్నాడో వివరాల్లోకి వెళ్తే..

తాను 129 మంది పిల్లలకు తండ్రయ్యానని .. మరో తొమ్మిది మంది గర్భం ధరించారని.. చెబుతున్న జోన్స్.. “ప్రపంచంలోనే అత్యంత ఫలవంతమైన స్పెర్మ్ దాత”తాను అంటున్నాడు. UKలోని డెర్బీలోని చాడెస్‌డెన్‌లో నివసిస్తున్న 66 ఏళ్ల రిటైర్డ్ టీచర్ క్లైవ్ జోన్స్ తొమ్మిదేళ్లుగా తన స్పెర్మ్‌ను దానం చేస్తున్నట్లు చెప్పాడు. జోన్స్ 58 సంవత్సరాల వయస్సులో స్పెర్మ విరాళం ఇవ్వడం ప్రారంభించడంతో అధికారికంగా స్పెర్మ్ దాతగా గుర్తింపు పొందలేక పోయాడు. ఎందుకంటే యుకే లో స్పెర్మ్ ఇవ్వాలనుకునే వ్యక్తి 45 ఏళ్ళు లోపులో ఉండాలనే నిబంధన ఉంది. తాను ఇప్పటి వరకూ స్పెర్మ్‌ ఇచ్చినందుకు ఎటువంటి డబ్బులు తీసుకో లేదని వెల్లడించాడు. మరొకిన్నేళ్లపాటు వీర్యదానం చేస్తానని, 150 మందికి తండ్రి అయిన తర్వాత వీర్యదానం చేయనని క్లైవ్‌ స్పష్టం చేశాడు.

తాను ఫేస్‌బుక్‌ ద్వారా కస్టమర్లతో కనెక్ట్‌ అయి ఉచితంగా వీర్యదానం చేస్తున్నట్లు చెప్పాడు జోన్స్. బ్రిటన్‌లో చాలా క్లినిక్‌లు వీర్యాన్ని అమ్ముతున్నట్లు తెలిపారు. ఒకరికి ఆనందాన్ని ఇవ్వడం, వారికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తాను సంతోషపడుతున్నానని క్లైవ్ చెబుతున్నాడు. తనకు వచ్చే మెసేజ్ లు , పిల్లలతో సంతోషంగా ఉన్న తల్లుల ఫోటోలు చూస్తే తనకు మరింత ఆనందమని అన్నారు. తాను తండ్రులుగా చెప్పుకుంటున్న 129 మంది పిల్లలలో 20 మందిని తాను కలిశానని జోన్స్ చెప్పాడు.

అయితే, హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ… జోన్స్ కు హెచ్చరికను జారీ చేసింది. లైసెన్స్ పొందిన UK క్లినిక్‌లో చికిత్స పొందాలని పేర్కొంది. బ్రిటన్‌లో స్పెర్మ్ డొనేషన్, కొనుగోలు చేయడం లైసెన్స్ పొందిన క్లినిక్ ద్వారా మాత్రమే చేయాలని సూచించింది. అంతేకాదు ఎవరినా వ్యాధుల బారిన పడితే వెంటనే అధికారిక క్లీనిక్ లో చికిత్స తీసుకోవాలని సూచించారు.

Also Read: గరుడ పురాణంలో అనేక నరకాలు.. ఏ కర్మకు ఎలాంటి శిక్ష విధించబడుతుందో తెలుసుకోండి…

Latest Articles