తగ్గేదే లే.. ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా అదరగొడుతున్న 88 ఏళ్ల వృద్ధుడు – Watch Video
ఫుట్‌బాల్ క్రీడపట్ల ఆయనకున్న మక్కువ ముందు.. వయస్సు చిన్నబోతోంది. దాదాపు తొమ్మిది పదుల వయసులోనూ ఫుట్ బాల్ ఆటలో ఆ వృద్ధుడు అదరగొడుతున్నాడు.
ఫుట్‌బాల్ క్రీడపట్ల ఆయనకున్న మక్కువ ముందు.. వయస్సు చిన్నబోతోంది. దాదాపు తొమ్మిది పదుల వయసులోనూ ఫుట్ బాల్ ఆటలో ఆ వృద్ధుడు అదరగొడుతున్నాడు. ఫుట్‌బాల్ మైదానంలో పాదరసంలా కదిలిపోతూ ప్రత్యర్థి ఆటగాళ్లకు దడపుట్టిస్తున్నాడు. బ్రిటన్ నార్త్ వేల్స్‌లోని ఓ లోకల్ ఫుట్‌బాల్ క్లబ్(Bay Stollers FC) తరఫున 88 ఏళ్ల అలాన్ కామ్సెల్ ఇప్పటికీ గోల్ కీపర్‌గా ఆడుతున్నాడు. తన సహచర ఆటగాళ్ల మనవళ్లతో కలిసి ఇప్పుడు తాను మ్యాచ్‌లు ఆడుతుండటం పట్ల గర్విస్తున్నట్లు అలాన్ కామ్సెల్ చెప్పాడు.లాన్‌డుడ్నో ప్రాంతంలో గోల్ కీపర్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఆయన ఆటతీరును చూసేందుకు స్థానిక జనం, ఫుట్‌బాల్ క్రీడాభిమానులు కూడా భారీ సంఖ్యలోనే మైదానాలకు తరలివస్తారు.
ఒక్కో రోజు తాను కాస్త బద్దకంగా ఫీల్ అయినా.. మరుసటి రోజే ఉత్సాహంగా మ్యాచ్ ఆడుతానని అలాన్ కామ్సెల్ చెప్పాడు. కొన్ని సందర్భాల్లో బంతి తనను దాటుకుని గోల్ అవుతుందని.. అయినా దాన్ని ఫన్‌గానే తీసుకుంటానని వివరించాడు.
88 ఏళ్ల అలాన్ కామ్సెల్ గురించి బీబీసీ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీంతో ఆయన పేరు బ్రిటన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆయన ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి.
Antrenman da yapıyor, kurtarış da. ⛔
1⃣ O, tam 88 yaşında ve İngiltere’de mahalli bir takım olan Stollers’ın hala 1 numarası. Takım arkadaşlarının çoğu ise futbola ilk başladığı arkadaşlarının torunları.
Karşınızda Alan Camsell ? pic.twitter.com/YdbaHTURrM
— TRT Spor (@trtspor) October 1, 2021
Also Read..