Viral: వామ్మో..అక్కడ వాష్‌రూం వాడుకోవాలంటే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే.. జస్ట్‌ యూరిన్‌కు వెళ్లినందుకు ఏకంగా..

Agra Railway Station: సాధారణంగా అన్ని వస్తు, సేవలపై జీఎస్టీ ఉంటుందని తెలుసు. అయితే వాష్‌రూంను వాడుకున్నందుకు కూడా జీఎస్టీ ప‌డుతుంద‌ని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే.

Viral: వామ్మో..అక్కడ వాష్‌రూం వాడుకోవాలంటే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే.. జస్ట్‌ యూరిన్‌కు వెళ్లినందుకు ఏకంగా..
Agra Cantt Railway Station
Follow us
Basha Shek

|

Updated on: Sep 03, 2022 | 7:15 PM

Agra Railway Station: జీఎస్టీ.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీలో చేసిన మార్పులు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా అన్ని వస్తు, సేవలపై జీఎస్టీ ఉంటుందని తెలుసు. అయితే వాష్‌రూంను వాడుకున్నందుకు కూడా జీఎస్టీ ప‌డుతుంద‌ని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే. ఈ విష‌యం తెలియ‌క‌ ఆగ్రా కాంట్ రైల్వే స్టేష‌న్‌లో వాష్‌రూంను ఉప‌యోగించుకున్న ఇద్దరు విదేశీయులు షాక్ అయ్యారు. కేవలం ఐదు నిమిషాలు వాష్‌రూంను వినియోగించుకున్నందుకు జీఎస్టీతో క‌లిపి రూ.224 చెల్లించారు. విదేశీయులను రిసీవ్‌ చేసుకునేందుకు వచ్చిన గైడ్‌ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

గతిమాన్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఇద్దరు విదేశీ పర్యాటకులు ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్‌లో దిగారు. బ్రిటిష్ ఎంబసీ నుంచి వచ్చిన వారికి గైడ్ ఐసీ శ్రీవాస్తవ స్వాగతం పలికాడు. పర్యాటకులు వాష్‌రూంకు వెళ్లాల‌ని గైడ్‌ను అడ‌గ్గా, స్టేషన్‌లో ఉన్న ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లోని వాష్‌రూంకు తీసుకెళ్లాడు. 5 నిమిషాల తర్వాత వారు బయటకు వ‌చ్చారు. ఇంతలో అక్కడి రిసెప్షన్‌లో కూర్చున్న అమ్మాయి రూ. 224 బిల్లు వారి చేతిలో పెట్టింది. దీంతో విదేశీ పర్యాటకులు షాక్‌కు గుర‌య్యారు. దీనిపై వివరాలు అడగ్గా.. ఒక్కొక్కరి బిల్లు రూ. 100. దానిపై జీఎస్టీ రూ. 12. అలా ఇద్దరికీ క‌లిపి రూ. 224 బిల్లు అయ్యింద‌ని రిసెప్షనిస్ట్‌ సమాధానమిచ్చింది. దీనిపై విదేశీయులతో పాటు గైడ్‌కూడా అభ్యంత‌రం వ్యక్తం చేశాడు. ఇక్కడి రూల్స్‌ ఇలాగే ఉంటాయని రిసెప్షనిస్ట్‌ చెప్పడంతో చేసేదేమి లేక చివ‌రికి అడిగినంతా ఇచ్చి బ‌య‌ట‌కు వచ్చారు విదేశీయులు. ‘జనరల్ కోచ్‌లో ఆగ్రా నుంచి ఢిల్లీకి టికెట్‌ రూ. 90 మాత్రమే. కానీ, వాష్‌రూం వాడుకున్నందుకు రూ.112 ఛార్జ్ చేస్తున్నారు’ అని గైడ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ ప్రతినిథి మాట్లాడుతూ.. ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో ఎంట్రీకి ప్రత్యేక రుసుం ఉంటుందని, దానిపై జీఎస్టీ విధిస్తారని చెప్పుకొచ్చాడు. లోప‌ల టాయిలెట్‌తోపాటు ఇంటర్నెట్‌ ఫెసిలిటీ కూడా ఉంటుందని..ఐదు నిమిషాలున్నా.. గంట‌సేపున్నా అదే రుసుం వ‌ర్తిస్తుంద‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?