Video Viral: ఆడ ఏనుగుకి పువ్వులు ఇస్తూ.. ప్రపోజ్ చేసిన ఏనుగు.. మాకు ఇలాంటి ప్రపోజల్ కావాలి అంటున్న నెటిజన్లు..

Video Viral: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు,..

Video Viral: ఆడ ఏనుగుకి పువ్వులు ఇస్తూ.. ప్రపోజ్ చేసిన ఏనుగు.. మాకు ఇలాంటి ప్రపోజల్ కావాలి అంటున్న నెటిజన్లు..
True Love

Video Viral: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, కోతుల వంటి జంతువుల వీడియోలతో పాటు.. ఏనుగులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఏనుగు.. ఆడ ఏనుగుకి ప్రపోజ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

మనుషుల జీవితానికి ఏనుగుల జీవితానికి దగ్గర సంబంధం ఉంది. ఏనుగులు కూడా మనుషులు చేసే పనులు చేస్తాయి. అందుకే సర్కస్ లో ఏనుగులు ప్రధాన ఆకర్షణీయం. తాజాగా ఓ ఏనుగు తన ప్రేమని వ్యక్తం చేయడానికి గులాబీ పువ్వులను పట్టుకుని అందంగా నడుచుకుంటూ ఆడ ఏనుగు దగ్గరకు వెళ్ళింది. తన తొండంతో గులాబీరంగులో ఉన్న పువ్వుల గుత్తిని పట్టుకుని ఆడ ఏనుగుకి తన ప్రేమని వ్యక్తం చేస్తూ ప్రపోజ్ చేసింది. హొయలు ఒలికిస్తూ..ఆడ ఏనుగు ఆ పువ్వులను అందుకున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.  ఈ అందమైన జంట వీడియోను ఎలిఫెంట్స్    ఆఫ్ వరల్డ్ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో క్లిప్‌కి లక్షకు పైగా లైక్‌లు, వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. “ఏనుగు నుంచి అయినా సరే నాకు ఇలాంటి ప్రపోజల్ కావాలని ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తుంటే.. మరొకరు.. ఇది నిజమైన ప్రేమ.. సంపూర్ణమైంది.. అంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read :   శాఖాహార పాలు అంటే ఏమిటి.. వాటిల్లో రకాలు.. ఉపయోగాలు..

ఈ గేదె తెలివి తేటలు మాములుగా లేవుగా దాహం తీర్చుకోవడానికి.. చేసిన పని చూస్తే ఔరా అనకమానరు ఎవరైనా..

Click on your DTH Provider to Add TV9 Telugu