Fact Check: పానీపూరికి వాడే నీళ్లలో డొమెక్స్‌ కలుపుతున్నారంటూ వార్తలు.. వైరల్‌ అవుతోన్న వీడియోలో నిజమెంత.?

Fact Check: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచార మార్పిడి చాలా సులభతరమైంది. ప్రపంచంలో ఓ మూలన జరిగిన విషయం మరో మూలన జరిగిన వారికి క్షణాల్లో తెలిసిపోతోంది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌, అందులో...

Fact Check: పానీపూరికి వాడే నీళ్లలో డొమెక్స్‌ కలుపుతున్నారంటూ వార్తలు.. వైరల్‌ అవుతోన్న వీడియోలో నిజమెంత.?
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 14, 2022 | 1:50 PM

Fact Check: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచార మార్పిడి చాలా సులభతరమైంది. ప్రపంచంలో ఓ మూలన జరిగిన విషయం మరో మూలన జరిగిన వారికి క్షణాల్లో తెలిసిపోతోంది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌, అందులో సోషల్‌ మీడియా యాప్‌లు ఉంటే చాలు క్షణాల్లో విషయం తెలిసిపోతోంది. అయితే కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. సమాచారం పేరుతో తప్పుడు సమాచారం కూడా వైరల్‌ అవుతోంది. వచ్చిన ఇన్ఫర్మేషన్‌ సరైందా కాదా అని వెనుకాముందు ఆలోచించకుండా ఫార్వర్డ్‌ చేసేస్తున్నారు. దీంతో అనవసర భయాలకు దారి తీస్తున్నాయి. కొంత మంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియోలను నెట్టింట వైరల్‌ చేస్తున్నారు.

తాజాగా అలాంటి ఓ ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. పానిపూరీ అమ్మే ఓ వ్యక్తి పానిపూరిలకు ఉపయోగించే నీటిలో టాయిలెట్స్‌ను శుభ్రం చేసే డొమెక్స్‌ లిక్విడ్‌ వేస్తున్నట్లున్న ఓ వీడియో గత కొన్ని రోజులుగా తెగ వైరల్‌ అయ్యింది. ముఖం కనిపించకుండా కవర్‌ చేసుకున్న ఓ వ్యక్తి ఈ పని చేస్తున్నట్లు, దానిని కొందరు సీక్రెట్‌గా వీడియో తీస్తున్నట్లు ఉంది ఆ వీడియోలో. దీంతో ఈ వీడియో చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మనం తింటోన్న పాని పూరీలను ఇంత దారుణంగా తయారు చేస్తారా? అని ఆందోళనకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

అయితే ఓ స్వచ్చంధ సంస్థ నిర్వహించిన పరిశోధనలో ఈ వీడియో ఫేక్‌ అని తేలింది. గైన్‌ భండార్‌ అనే ఫేస్‌బుక్‌ పేజీ రన్‌ చేస్తున్న వారు ఈ వీడియోను ఉద్దేశపూర్వకంగా రూపొందించినట్లు బట్టబయలైంది. ఈ వీడియోను కేవలం వినోదం కోసం మాత్రమే రూపొందించామంటూ.. అప్‌లోడ్‌ చేసిన వ్యక్తులు పేర్కొన్నట్లు పరిశోధనలో తేలింది. చూశారుగా సోషల్‌ మీడియాలో వచ్చింది కదా గుడ్డిగా నమ్మి అనవసర భయాలకు పోకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిజానిజాలు తెలుసుకోవడం చాలా అవసరం.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..