Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ద్యావుడా.. నిమ్మలంగా నదిని దాటుతున్న సింహాలకు చుక్కలు చూపించిన నీటి ఏనుగు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

ప్రాణాలను రక్షించుకునేందుకు సింహాలు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన దక్షిణ ఆఫ్రికా ఖండ దేశం బోట్స్‌వానా (Botswana) లోని సెలిండా రిజర్వ్ లో జరిగింది.

Viral Video: ద్యావుడా.. నిమ్మలంగా నదిని దాటుతున్న సింహాలకు చుక్కలు చూపించిన నీటి ఏనుగు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Hippo Attacks On Lions
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 14, 2022 | 4:41 PM

అడవికి రారాజు సింహం.. నీటిలో రాజు మాత్రం సింహం కాదు.. ఎందుకంటే అక్కడ రాజ్యం మరొకరిది. నీటిలో మొసలి, ఆ తర్వాత నీటి ఏనుగులదే ఆధిపత్యం. కాదు కూడాదని గీత దాటితే అది రాజైనా.. రారాజైన ఖేల్ కతం. అచ్చు ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో మూడు సింహాలు నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా నీటి ఏనుగు(hippopotamus) ఒక్కసారి దాడి చేసింది. దీంతో ప్రాణాలను రక్షించుకునేందుకు సింహాలు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన దక్షిణ ఆఫ్రికా ఖండ దేశం బోట్స్‌వానా (Botswana) లోని సెలిండా రిజర్వ్ లో జరిగింది. గ్రేట్ ప్లెయిన్స్ కన్సర్వేషన్ వారు ఈ ఫుటేజ్‌ని యూట్యూబ్ లోని Latest Sightings వారికి ఇవ్వడంతో వారు అప్‌లోడ్ చేశారు.

బోట్స్‌వానాలోని సెలిండా స్పిల్‌వే (Selinda spillway) ని దాటేందుకు మూడు సింహాలు ప్రయత్నించాయి. ఒక సింహం మాత్రం నీటిలోకి దిగకుండా ఒడ్డునే చూస్తూ ఉండిపోయింది. అయితే ఈ సింహాలు నదిని దాటుతుండగా అందులోనే ఉన్న కొన్ని నీటిఏనుగుల్ని చూశాయి. నీటి ఏనుగులను తప్పించుకుని వేగంగా ప్రయత్నించాయి. అంతలో ఓ రెండు నీటి ఏనుగులు వాటిని చూశాయి. మెరుపు వేగంతో ఈదుతూ సింహాలను టార్గెట్ చేశాయి.

నీటి ఏనుగుల నుంచి తప్పించుకునేందుకు సింహాలు తలో వైపు వెళ్లాయి. అంతలోనే నీటి ఏనుగు వెళ్లి.. సింహాంపై దాడి చేసింది. ఈ వీడియో జులై 5, 2022న పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటివరకూ 31 లక్షల మందికి పైగా చూశారు. 25 వేల మందికి పైగా లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

సింహాలపై నీటి ఏనుగులు దాడి దృశ్యాలు ఇక్కడ చూడండి..

ట్రెండింగ్ న్యూస్ కోసం..

గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
పైకేమో అందాల భామ.. చేసే పనులేమో అయ్యబాబోయ్ అనేలా..
పైకేమో అందాల భామ.. చేసే పనులేమో అయ్యబాబోయ్ అనేలా..
ఛీ.. ఛీ.. స్పోర్ట్స్‌మెన్‌ స్పిరిట్‌ మరిచి ఇలా చేయాలా?
ఛీ.. ఛీ.. స్పోర్ట్స్‌మెన్‌ స్పిరిట్‌ మరిచి ఇలా చేయాలా?
జేఈఈ మెయిన్‌ 2025 పరీక్ష రాసేవారికి డ్రెస్‌ కోడ్ ఆంక్షలు..
జేఈఈ మెయిన్‌ 2025 పరీక్ష రాసేవారికి డ్రెస్‌ కోడ్ ఆంక్షలు..
ఓటీటీలోకి జీవి ప్రకాష్ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ కింగ్ స్టన్.
ఓటీటీలోకి జీవి ప్రకాష్ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ కింగ్ స్టన్.
తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..
తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..
రామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య.. భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు
రామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య.. భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు