Viral Video: వేదికపై పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. వీడియో చూస్తే బిత్తరపోతారంటే!
ఇంతకీ ఏంటో ఈ మధ్య ప్రతీ ఒక్కరూ పెళ్లంటే చాలు.. ఫ్రస్టేట్ అయిపోతున్నారు. నాడు పెళ్లి గురించి వధువు..
ఇంతకీ ఏంటో ఈ మధ్య ప్రతీ ఒక్కరూ పెళ్లంటే చాలు.. ఫ్రస్టేట్ అయిపోతున్నారు. నాడు పెళ్లి గురించి వధువు.. రాకుమారుడు రెక్కల గుర్రంపై తనను ఎక్కించుకుని వెళ్తాడని ఊహించుకుంటే.. వరుడైతే.. పెళ్లి కూతురు ఓ దేవతలా తన దగ్గరకు స్వర్గం నుంచి వస్తుందని కలలు కనేవాడు. అయితే ఇప్పుడు సీన్ కాస్తా రివర్స్ అయింది. జరుగుతున్నది పెళ్ళా..? లేక డబ్ల్యూడబ్ల్యూఈనా అని అనిపించేలా మారింది. ఇందుకు నిదర్శనంగా చాలానే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి కోవకు చెందిన వీడియోనే ఇది.
చూశారా.. ఏందండీ ఇది.. వేదికగా వధూవరులు ఇద్దరూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకునేందుకు ఎలా బిహేవ్ చేస్తున్నారో.? ఇది చూశాక అసలు ఇంతకీ వాళ్లు సంతోషంగానే పెళ్లి చేసుకున్నారా.? అని డౌట్ రాకమానదు. ఎలాగో పెళ్లి జరిగిన ఆరు నెలలకు కొట్టుకొవడం, తిట్టుకోవడం, ఈసడించుకోవడం అన్ని జరుగుతాయి. అయితే మరీ అవన్నీ ఇప్పుడే చూపించాలా.! ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.