AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. మొసలితో పెద్దపులి భీకర పోరులో ఊహించని ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

Tiger Attacks Crocodile: ప్రకృతిలో ఏ జీవీ శాశ్వత విజేత కాదు అనడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. అడవికి రాజుగా, తిరుగులేని వేటగాడిగా పేరొందిన పెద్దపులి సైతం నీటి సామ్రాజ్యంలో మొసలి బలాన్ని తట్టుకోలేక వెనుతిరగాల్సి వచ్చింది. వన్యప్రాణి చరిత్రలో అత్యంత అరుదుగా నిలిచే ఈ భీకర పోరు, ప్రకృతి నియమాలను మనకు మరోసారి గుర్తుచేస్తుంది.

Viral Video: వామ్మో.. మొసలితో పెద్దపులి భీకర పోరులో ఊహించని ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?
Tiger Hunts Crocodile Video
Venkata Chari
|

Updated on: Jun 30, 2026 | 3:48 PM

Share

Tiger Attacks Crocodile: రణతంబోర్ జాతీయ పార్కులో ప్రకృతి ప్రేమికులను విస్మయానికి గురిచేసే ఒక అరుదైన దృశ్యం వెలుగుచూసింది. ఆకలితో ఉన్న ఒక పెద్దపులి, ప్రమాదకరమైన మొసళ్ళు ఉన్న సరస్సులోకి దూకి మరి ఒక భారీ మొసలిపై దాడి చేసింది. సాధారణంగా అడవి జంతువులను వేటాడే పులి, నీటి సామ్రాజ్యానికి రాజు లాంటి మొసలితో తలపడటం అక్కడ ఉన్న పర్యాటకులను ఊపిరి బిగబట్టేలా చేసింది.

వేట కోసం సాహసం..

భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం రణతంబోర్ నేషనల్ రిజర్వ్‌లో రామన్ గొంజాలెజ్ అనే పర్యాటకుడు తన సఫారీ సమయంలో ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. ఎండ తీవ్రతకు దాహం తీర్చుకోవడానికి ఏవైనా జంతువులు సరస్సు వద్దకు వస్తాయేమోనని పర్యాటకులు ఎదురుచూస్తున్న సమయంలో, సరస్సు అవతలి ఒడ్డున ఉన్న చెట్ల పొదల్లోంచి ఒక పెద్దపులి నెమ్మదిగా అడుగులు వేస్తూ ప్రత్యక్షమైంది.

ఇది కూడా చదవండి: Video: నల్లతాచుతో మొసలి భీకర పోరాటం.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో చూస్తారా..?

అత్యంత అప్రమత్తంగా, శత్రువుకు చిక్కకుండా పిల్లి అడుగులతో ఆ పులి సరస్సు వైపు సాగింది. నీటి అంచుకు చేరుకున్న మరుక్షణమే, మెరుపు వేగంతో నీటిలోకి లంఘించింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న సరస్సు నీరు ఒక్కసారిగా అలజడికి గురైంది. మొదట పులి దేనిని వేటాడుతోందో పర్యాటకులకు అర్థం కాలేదు, కానీ నీటి పైకి భారీ మొసలి రావడం చూసి అందరూ నోరెళ్లబెట్టారు.

జీవన్మరణ పోరాటం: తలపడ్డ రెండు అగ్ర శ్రేణి జీవులు..

సాధారణంగా పులులు దుప్పి, అడవి పంది వంటి జంతువులను వేటాడతాయి. వాటి దవడలు, పళ్ళు భూమిపై ఉన్న జంతువులను క్షణాల్లో అంతమొందించగలవు. కానీ, మొసలి కథ వేరు. దాని శరీరంపై ఉండే గట్టి చర్మం ఒక కవచం లాంటిది. పైగా నీటిలో మొసలికి ఉన్న బలం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో, నీటిని చిమ్ముతూ ఈ రెండు భీకర జీవులు జీవన్మరణ పోరాటానికి దిగాయి. పులి తన పంజా విసురుతుంటే, మొసలి తన బలమైన దవడలతో ఎదురుదాడికి దిగింది. నిమిషాలు గడుస్తున్న కొద్దీ సరస్సులో నీటి తుంపరలు, భీకర శబ్దాలు ఆ ప్రాంతాన్ని వణికించాయి.

Video: చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు.. వీడియో చూస్తే చెమటలు పట్టేస్తాయ్..!

ఊహించని ఎదురుదెబ్బ..

పులి తన సర్వశక్తులూ ఒడ్డి మొసలిని లొంగతీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, మొసలి రక్షణ కవచం పులి గోళ్ళకు, పళ్ళకు లొంగలేదు. పైగా నీటిలో మొసలికి ఉన్న అనుకూలత పులికి ప్రతికూలంగా మారింది. మొసలి ఎదురుదాడి తీవ్రం కావడంతో, వేటాడటానికి వచ్చిన పులి స్వయంగా ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. చివరికి ఈ పోరులో మొసలిదే పైచేయి అయింది. మొసలి బలాన్ని తట్టుకోలేక పులి వెనక్కి తగ్గక తప్పలేదు. తన ప్రాణాలను దక్కించుకుని మొసలి సురక్షితంగా నీటి లోతుల్లోకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది.

Follow Us