కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. రైల్వేలో వేలాది ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్
RRB Technician Recruitment 2026: భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో మొత్తం 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, గ్రేడ్-3 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

రైల్వే శాఖ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో.. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ RRB (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 6,557 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 323, గ్రేడ్ 3 పోస్టులు 6,565 వరకు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రాక్ మెషిన్, బ్రిడ్జ్, డిజిల్ ఎలక్ట్రికల్/ మెకానికల్, ఎలక్ట్రికల్/ మెకానికల్, ఎలక్ట్రికల్/ టీఆర్‌ఎస్, ఈఎంయూ, ఫిట్టర్, వెల్డర్, కార్పెంట్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగాల తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఎక్కువ మంది చదివినవి: పరోపకారమే పరమ ధర్మం.. మంచితనమే మహా మంత్రం.. మాయాచాప కథ
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు పోస్టులకు టెన్త్, ఐటీఐ, బీఎస్సీ, డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 29, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌సర్విస్‌మెన్/ పీడబ్ల్యూబీడీ/ మహిళలు/ ట్రాన్స్‌జండర్/ ఈబీసీ అభ్యర్ధులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. సీబీటీకు హాజరైన వారికి రూ.400 వరకు రిఫండ్ (బ్యాంక్ ఛార్జీలు మినహాయించి) చేస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది.
ఆర్‌ఆర్‌బీ రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పరీక్ష విధానం ఇలా..
కంప్యూటర్ ఆధారిత ఎగ్జామినేషన్‌లో మొత్తం 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. జనరల్ ఆవేర్‌నెస్ (10 ప్రశ్నలు 10 మార్కులు), జనరల్ ఇంటలీజెన్స్ అండ్ రీజనింగ్ (15 ప్రశ్నలు 15 మార్కులు), బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్(20 ప్రశ్నలు 20 మార్కులు), మ్యాథమెటిక్స్ (20 ప్రశ్నలు 20 మార్కులు), బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (35 ప్రశ్నలు 35 మార్కులు) నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానాలకు 1/3 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఇది కూడా చదవండి: ONE = 314, TWO = 325, THREE = 538 అయితే SIX = ఎంత..? మ్యాథ్స్ కాదు లాజిక్ కావాలి..
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జూన్ 30, 2026.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జులై 2, 2026.
- ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: జులై 31, 2026.
- అప్లికేషన్ సవరణ తేదీలు: ఆగస్ట్ 1 నుంచి 10 వరకు.
- రాత పరీక్ష తేదీలు: త్వరలో వెల్లడి
ఆర్‌ఆర్‌బీ రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




