వరంగల్లోని ఓ పొలంలో కూలీలకు బంగారం దొరకడంతో కలకలం రేగింది. దొరికిన బంగారాన్ని పంచుకునే విషయంలో కూలీలు, కౌలు రైతు మధ్య మొదలైన వివాదం, పోలీస్ స్టేషన్కు చేరింది. ఆరేళ్ల క్రితం భూమిని విక్రయించిన పాత యజమాని కూడా రంగంలోకి దిగడంతో వ్యవహారం మరింత జటిలమైంది.