AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: లక్కంటే నీదేరా.. చావు నోట్లోంచి బతికొచ్చాడు.. ఈ వీడియో చూస్తే మీ మైండ్ బ్లాంకే..

కళ్లముందే చావు కనిపిస్తున్నా.. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడిన ఒక బైకర్ భయానక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడుతున్న వేళ.. రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఒక బైకర్, బైక్‌తో సహా వందల అడుగుల ఎత్తు నుంచి కొట్టుకుంటూ వెళ్లి నదిలో పడిపోయాడు. దీనికి సంబంధించి వైరల్‌గా మారింది.

Video: లక్కంటే నీదేరా.. చావు నోట్లోంచి బతికొచ్చాడు.. ఈ వీడియో చూస్తే మీ మైండ్ బ్లాంకే..
Biker Swept Away In Arunachal Pradesh Landslide
Krishna S
|

Updated on: Jun 30, 2026 | 1:51 PM

Share

ప్రకృతి కన్నెర్ర జేస్తే ఎలా ఉంటుందో.. క్షణాల్లో ప్రాణాలు ఎలా గాల్లో కలిసిపోతాయో చూపించే ఒక నమ్మశక్యం కాని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కొండపై నుంచి భారీగా కొండచరియలు విరిగిపడుతుండగా.. ఓ బైకర్ వాటితో పాటే కొట్టుకుపోయిన ఒళ్లు గగుర్పొడిచే ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. అంత పెద్ద ప్రమాదం జరిగినా, ఆ బైకర్ చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ భయానక ఘటన జూన్ 28న అరుణాచల్ ప్రదేశ్‌లోని లోయర్ సియాంగ్ జిల్లా సిజి ప్రాంతంలో జరిగింది. ఈశాన్య భారత దేశంలో ప్రస్తుతం నైరుతి రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి కొండ ప్రాంతాల్లోని రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఓ బైకర్ బురదమయంగా మారిన కొండ రహదారిపై నుంచి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడు సగం దూరం వెళ్లేసరికి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. కనురెప్ప మూసి తెరిచేలోగా.. ఆ బైకర్‌తో పాటు అతడి మోటార్ సైకిల్ కూడా ఆ మట్టి శిథిలాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కొండపై నుంచి నేరుగా కింద ప్రవహిస్తున్న సిజి నదిలోకి ఆ బురద, రాళ్లతో పాటు బైకర్ కూడా పడిపోయాడు. కొండచరియలు పడటంతో ఆ నదీ ప్రవాహం కూడా కాసేపు స్తంభించిపోయింది.

లాటరీ కొనుక్కోవాల్సిందే..

ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న కొందరు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయడంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అంత ఎత్తు నుంచి నదిలోకి పడిపోయినప్పటికీ.. ఆ బైకర్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు.. ‘‘ఇది ఖచ్చితంగా పునర్జన్మే.. ఇతడు వెంటనే వెళ్లి ఒక లాటరీ టికెట్ కొనుక్కోవాలి, అంత అదృష్టం ఉంది’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అతని ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

పర్వత ప్రాంత ప్రయాణీకులకు హెచ్చరిక

ప్రస్తుతం వర్షాల కాలం కావడంతో కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో మరోసారి గుర్తు చేస్తోంది. క్షణాల్లో వాతావరణం మారిపోయి కొండలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున, అత్యవసరమైతే తప్ప కొండ దారుల్లో ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us
లక్కంటే నీదేరా.. చావు నోట్లోంచి బతికొచ్చాడు.. ఈ వీడియో చూస్తే..
లక్కంటే నీదేరా.. చావు నోట్లోంచి బతికొచ్చాడు.. ఈ వీడియో చూస్తే..
రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు రద్దు కానున్నాయా?
రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు రద్దు కానున్నాయా?
ప్రతి రోజూ చికెన్ తింటే ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా..?
ప్రతి రోజూ చికెన్ తింటే ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా..?
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచులు..ఎప్పుడు, ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచులు..ఎప్పుడు, ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
మనిషి చిన్నగా అయిపోయి.. కోమాలోనే ఉన్నారు.. అలా చూడగానే ఏడ్చేశా..
మనిషి చిన్నగా అయిపోయి.. కోమాలోనే ఉన్నారు.. అలా చూడగానే ఏడ్చేశా..
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
మీ పుట్టిన తేదీ చెప్పేస్తుంది.. ఏ వయసులో సొంత ఇల్లు యోగం ఉందో..?
మీ పుట్టిన తేదీ చెప్పేస్తుంది.. ఏ వయసులో సొంత ఇల్లు యోగం ఉందో..?
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే
దేశ వ్యాప్తంగా వాతావరణాన్ని మార్చబోతున్న రుతుపవనాలు.. !
దేశ వ్యాప్తంగా వాతావరణాన్ని మార్చబోతున్న రుతుపవనాలు.. !
భారత్‌కు జపాన్ ప్రధాని.. మోదీతో కీలక చర్చలు..
భారత్‌కు జపాన్ ప్రధాని.. మోదీతో కీలక చర్చలు..