ఊహించని మృత్యువు.. రెండు లారీల మధ్య నలిగిపోయిన కారు.. పసిబిడ్డతో సహా ముగ్గురు దుర్మరణం!
కృష్ణా-ఎన్టీఆర్ జిల్లాల సరిహద్దులోని పశ్చిమ బైపాస్ రోడ్డు, బీబిగూడెం వద్ద మంగళవారం (జూన్ 30) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమాయక ప్రాణాలను బలితీసుకున్న ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరితో పాటు మరో బైక్ ప్రయాణికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వేగంగా వెళ్తున్న ఒక భారీ కంటైనర్, ట్యాంకర్ మధ్యలో కారు ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. రెండు భారీ వాహనాలు బలంగా ఢీకొట్టడంతో వాటి మధ్యలో ఉన్న కారు పూర్తిగా నలిగిపోయింది. ఈ ఘోర ప్రమాదం దాటికి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నాలుగు సంవత్సరాల చిన్నారి కూడా ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
ఇదే ప్రమాదంలో అదే సమయంలో కారు ముందు వెళ్తున్న ఒక బైక్‌ను సైతం ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా రోడ్డుపై పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే గన్నవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత కారణంగా నలిగిపోయిన కారులో నుంచి మృతదేహాలను వెలికితీయడానికి సహాయక చర్యలు చేపట్టారు. గన్నవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమా, లేక బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ఘోరం జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పశ్చిమ బైపాస్ మార్గంలో ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..